Moviesఆ విషయంలో ప్రభాస్ అంటే గోపీచంద్ కి పిచ్చ కోపం.. ఇప్పటికి...

ఆ విషయంలో ప్రభాస్ అంటే గోపీచంద్ కి పిచ్చ కోపం.. ఇప్పటికి గొడవలు పడతారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్టార్ డైరెక్టర్ – హీరోస్ , హీరో – హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ – డైరెక్టర్స్ ఇలా బోలెడు మంది చాలా జాన్ జిగిడి దోస్తులు.. ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో వన్ ఆఫ్ ద టాప్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ -మ్యాంచో హీరో గోపీచంద్. వీళ్ళిద్దరు ఎంత జాన్ జిగిడి దోస్తులనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ గా ముందుకు సాగుతున్నారు . అయితే కెరియర్ పరంగా రెబల్ స్టార్ ఎక్కడో ఉంటే గోపీచంద్ మాత్రం ఇంకా డౌన్ స్టెప్ లోనే ఉన్నారు . ఒక్కొక్క సినిమాకి ప్రభాస్ రెమ్యూనరేషన్ క్రేజ్ ని పెంచుకుంటూ పోతుంటే గోపీచంద్ ఒక హిట్ కొట్టడానికే నానాదంటాలు పడుతున్నారు. అయితే చాలామంది ప్రభాస్ తలుచుకుంటే గోపీచంద్ కి సినిమా అవకాశాలు రప్పించడం ఎంతసేపు చిటికెలో పని అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు .

అయితే అలాంటి వాళ్ళకి రెబల్ ఫాన్స్ ఘాటుగా జవాబు ఇస్తున్నారు . నిజానికి గోపీచంద్ కి ఒకరి దగ్గర హెల్ప్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు . సొంత టాలెంట్ తోనే పైకి రావాలి అని మొదటినుంచి అనుకునే టైప్.. అందుకే చాలాసార్లు చాలా సందర్భాలలో రెబల్ స్టార్ ప్రభాస్ కి గోపీచంద్ కి ఇదే విషయంగా గొడవ అయిందట. ప్రభాస్ తనకున్న పలుకుబడితో అవకాశాలు ఇప్పించడానికి చాలా ట్రై చేశారట . అవకాశాలు ఇప్పించిన ప్రతిసారి ప్రభాస్ కి గోపీచంద్ కి గొడవ అవుతూనే ఉండేదట . గోపీచంద్ తన సొంత టాలెంట్ తో పైకి రావాలని ఆలోచిస్తూ ఉంటాడు .. అందుకే గోపీచంద్ అంటే ప్రభాస్కి అంత ఇష్టం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news