Newsనెల రోజులు 4 మెగా ప్లాపులు... ఈసారి ఆ హీరో వంతు..!

నెల రోజులు 4 మెగా ప్లాపులు… ఈసారి ఆ హీరో వంతు..!

ఎస్ నెలరోజుల వ్య‌వ‌ధిలో మెగా కాంపౌండ్ హీరోల‌ నుంచి వచ్చిన సినిమాలలో నాలుగో ప్లాప్ కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ కలిసిన నటించిన బ్రో సినిమా అంచనాలు అందుకోలేదు. ఈ సినిమా 30 కోట్ల నష్టం మిగిల్చింది. ఆ తర్వాత చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు కూడా ఏకంగా 60 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇక తాజాగా వరుణ్ తేజ్ నటించిన గాండీవ ధారి అర్జున సినిమాకు కూడా రు. 20 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి.

ఈ మూడు సినిమాల దెబ్బ నుంచి టాలీవుడ్ కోలుకోలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన గుడుంబా శంకర్ సినిమా కూడా ఎవరు పట్టించుకునేలా లేరు. పవన్ సినిమాలు రీ రిలీజ్ లో కూడా ట్రెండ్ క్రియేట్ చేస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఖుషి. ఖుషి సినిమాలో రీ రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్ రిలీజ్ కు జరిగినంత హంగామా జరిగింది. ఆ తర్వాత మళ్లీ అంత సందడి తొలిప్రేమ విషయంలోనూ కనిపించింది.

అయితే గుడుంబా శంకర్ రీ రిలీజ్‌ చేస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ సినిమాకు పెద్దగా బుకింగ్స్ కూడా లేవు. పెద్ద పెద్ద సెంటర్లలో కూడా ఒక్కో షోకు పదికి మించి టికెట్లు తెగటం లేదు. అంటే గుడుంబా శంకర్ సినిమాపై ఆడియోస్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పవన్‌ బర్తడే స్పెషల్ అనే అంశం కూడా ఈ సినిమాకు కలిసి రావడం లేదు. రీసెంట్గా మెగా కాంపౌండ్ నుంచి వరుసగా వస్తున్న ప్లాపుల‌ పరంపరలో గుడుంబా శంకర్ కూడా కొట్టుకుపోయిందనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news