Newsప‌వ‌ర్‌స్టార్‌కు మ‌హేష్ స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌... ఏం చేశాడో చూడండి...!

ప‌వ‌ర్‌స్టార్‌కు మ‌హేష్ స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌… ఏం చేశాడో చూడండి…!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు తిరుగులేని స్టార్ హీరోలు. దాదాపు ఇద్దరి కేరీర్‌ ఒకే టైంలో స్టార్ట్ అయింది. మహేష్ కంటే పవన్ రెండు మూడు సంవత్సరాలు మాత్రమే ముందు సినిమాల్లోకి వచ్చారు. సినిమా కెరీర్‌ పరంగా ఇద్దరూ రెండున్నర దశాబ్దాలు పూర్తిచేసుకున్నారు. ఇద్దరు కూడా తిరుగులేని స్టార్డంతో దూసుకుపోతున్నారు.

అటు పవన్.. ఇటు మహేష్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే టాలీవుడ్ లో కోలాహలం ఎలా ?ఉంటుందో చెప్పక్కర్లేదు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 52 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ రోజు పవన్ పుట్టినరోజు కావడంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన తోటి నటుడు పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టు పెట్టారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్.. రాబోయే సంవత్సరం మీకు విజయం, ఆనందాన్ని తెస్తుంది అంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్ చెక్కర్లు కొడుతుంది.

తమ అభిమాన హీరోకు మహేష్ బాబు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పవన్ అభిమానులు మహేష్ బాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నారు. ఇక ఈరోజు పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలు నుంచి అప్డేట్లు ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news