Moviesవార్నీ..ఒక్క రోజు సునీల్ అలా చేస్తే అన్ని కోట్లు ఇస్తారా..? తమిళ్...

వార్నీ..ఒక్క రోజు సునీల్ అలా చేస్తే అన్ని కోట్లు ఇస్తారా..? తమిళ్ తంబీలకు మనోడు బాగా నచ్చేసిన్నట్లు ఉన్నాడే..!!

ప్రెసెంట్ కోలీవుడ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ కమెడియన్ కం హీరో సునీల్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని కామెడీ టైమింగ్ తో కడుపుబ్బ నవ్వించిన సునీల్ .. ఆ తర్వాత హీరోగా మారి సినిమాలో నటించి మెప్పించారు. కానీ ఆయన కమెడియన్ గానే చూసారు . అందుకే ఆయన హీరోగా సక్సెస్ కాలేకపోయారు. టాలీవుడ్ లో పలు సినిమాలో నటించిన రాని క్రేజ్ సునీల్ కు కోలీవుడ్ లో దక్కింది .

ఈ మధ్యకాలంలో కోలీవుడ్ సినిమాల్లో ఆయన ఎక్కువగా కనిపిస్తున్నాడు . రీసెంట్గా రిలీజ్ అయిన జైలర్ సినిమాలో సునీల్ పాత్ర అభిమానులకు ఎంతగా ఆకట్టుకునిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికంటే ముందే శివ కార్తికేయ నటించిన మహావీరుడు మూవీలోను సునీల్ నటించి మెప్పించాడు . ఇలాంటి క్రమంలోనే కోలీవుడ్లో సునీల్ కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి .

తాజాగా ఇప్పుడు విశాల్ హీరోగా తెరకెక్కిన మార్క్ ఆంటోనీ సినిమాలో నటించిన సునీల్ ..కోలీవుడ్ లో ఒక్కొక్క సినిమాకి గాను ఏకంగా కోట్లు డిమాండ్ చేస్తున్నారట . ఒక్కరోజు కోసం సునీల్ ఏకంగా నాలుగు లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నాడని .. ఈ లెక్కన ఆయన సినిమా పూర్తి అయ్యేసరికి దాదాపు 2 కోట్లు రూపాయలు పైనే పారితోషకం అందుకుంటున్నాడని .. ఇది కామన్ హీరోలతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ అని చెప్పుకొస్తున్నారు. దీంతో కోలీవుడ్ మీడియాలో సునీల్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news