News' భ‌గ‌వంత్ కేస‌రి ' బ‌డ్జెట్ & ప్రి రిలీజ్ బిజినెస్‌......

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ బ‌డ్జెట్ & ప్రి రిలీజ్ బిజినెస్‌… బాల‌య్య కెరీర్ ఆల్ టైం రికార్డ్‌..!

నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా భగవంత్‌ కేసరి అనిల్ రావిపూడికి అన్ని సూపర్ హిట్ సినిమాలే.. మ‌నోడికి తిరుగులేదు. క్రిటిక్స్ కామెంట్స్ తో సంబంధం లేకుండా కామన్ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ.. హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్యతో భగవంత్‌ కేసరి సినిమా తెరకెక్కించారు.

ఇటు బాలయ్య కూడా తిరుగలేని ఫామ్‌లో ఉన్నారు. అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ హిట్లు బాలయ్య ఖాతాలో ఉన్నాయి. ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత బాలయ్య హ్యాట్రిక్ హిట్లు కొట్టబోతున్నాడు అన్న ధీమా అందరిలోనూ కనిపిస్తోంది. కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ సినిమా పూర్తి చేసేసారు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టారు. 12 భారీ సెట్లు వేయడంతో పాటు 24 లొకేషన్ లకు వెళ్లారు. స్టార్ కాస్ట్ కూడా గట్టిదే.

అసలు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క్రేజీ బ్యూటీ శ్రీలీల‌ డేట్లు దొరకటం కష్టం.. ఆమెనే కీలకపాత్రలో తీసుకుని మరి ఈ సినిమా కంప్లీట్ చేసేశారు. బాల‌య్య కెరీర్‌లో బ‌డ్జెట్ ప‌రంగా ఎక్కువ పెట్టిన సినిమాగా భ‌గ‌వంత్ కేస‌రి రికార్డుల‌కు ఎక్కింది. ఈ సినిమాకు రు. 110 కోట్ల భారీ బ‌డ్జెట్ పెట్టారు. బాల‌య్య కెరీర్‌లో ఫ‌స్ట్ టైం రు. 100 కోట్లు ఖ‌ర్చు పెట్టిన సినిమా ఇదే.

అయితే ఈ సినిమాకు అన్ని వైపులా నుంచి రిట‌ర్న్స్ కూడా రు. 120 కోట్ల రేంజ్‌లో ఉన్నాయి. అయితే మూడు సినిమాల పోటీలో రిలీజ్ అవుతోంది. ద‌స‌రాకు భ‌గ‌వంత్ కేస‌రి, విజ‌య్ లియో, ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూడు సినిమాలు ఒకేసారి వ‌స్తున్నాయి. ఈ ట‌ఫ్ కాంపిటేష‌న్‌లో ఎక్కువ వ‌సూలు చేయ‌డం అంటే సినిమాలో స‌త్తా ఉండాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news