Moviesఎన్టీఆర్ స్నేహితుడి కొడుక్కి డైరెక్ష‌న్ ఛాన్స్ ఇచ్చిన బాల‌య్య‌… ఆ స్టార్...

ఎన్టీఆర్ స్నేహితుడి కొడుక్కి డైరెక్ష‌న్ ఛాన్స్ ఇచ్చిన బాల‌య్య‌… ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ లో ఒక మంచి గుణం ఉంటుంది. ఆయన ఏ విషయంలో అయినా ఎవరికైనా ఆ మాట ఇస్తే ఆ మాట కచ్చితంగా నెరవేర్చుకుంటారు. బాలయ్య నిర్మాతకు అయినా.. దర్శకుడికి అయినా నీతో సినిమా చేస్తున్న అని ఒక మాట అన్నారంటే అది ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఎంతోమంది టాలీవుడ్ హీరోలు ఎందరికో మాట ఇచ్చి తప్పిన సందర్భాలు ఉన్నాయి.

కొందరు స్టార్ హీరోలు అయితే అడ్వాన్సులు తీసుకుని నిర్మాతలకు వెనక్కు పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాలయ్యది అలాంటి మనస్తత్వం కాదు.. ఒక్కసారి మాట ఇచ్చాడంటే చాలు ప్రాణం పోయినా ఆ మాట నిలబెట్టుకోవాలి అన్నంత తపన కలిగి ఉంటాడు. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్‌కు కొన్ని సంవత్సరాలు పాటు మేకప్ మ్యాన్‌గా పనిచేశారు పితాంబరం.

అప్పట్లో ఎన్టీఆర్ సినిమా అంటే చాలు కాస్ట్యూమ్స్ పితాంబరం ఎంతో బాగా డిజైన్ చేసేవారు. ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. పౌరాణికంతో పాటు సాంఘిక సినిమాల్లోనూ ఆయన నటించారు. ఎన్టీఆర్ అంత అందంగా కనిపించడం వెన‌క‌ పితాంబ‌రం కృషి ఎంతో ఉంది. తర్వాత పితాంబరం కుమారుడు డైరెక్టర్ పి.వాసు దర్శకుడు అయ్యాక ఆయనతో ఒక సినిమా చేస్తానని హామీ ఇచ్చారు.

వాస్తవానికి అప్పడికి పీ. వాసుకి చంద్రముఖి తర్వాత వరుసగా ప్లాపులు వచ్చాయి. ఆయనపై ఎవరికి నమ్మకాలు లేవు. అయినా బాలయ్య ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మహారధి సినిమా చేశారు .మహారధి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించిన సినిమా అంచనాలు అందుకోలేదు. అయినా తన తండ్రి స్నేహితుడి కొడుకుకి ఇచ్చిన మాట మాత్రం బాలయ్య నిలబెట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news