Movies' జ‌వాన్ ' నార్త్ సినిమా ఒక‌లా… సౌత్ సినిమా ఒక‌లా…...

‘ జ‌వాన్ ‘ నార్త్ సినిమా ఒక‌లా… సౌత్ సినిమా ఒక‌లా… ఇదేం ట్విస్టురో….!

బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ కుర్ర డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం అడ్వాన్సు ద్వారానే ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి అంటే జవాన్ పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలుస్తోంది.

నయనతార – దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించగా జవాన్ లో షారుక్ ద్విపాత్రాభినయం పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా కనివినీ ఎరుగని రేంజ్ లో కలెక్షన్లు కొల్లబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా డైరెక్టర్ అట్లీ.. హీరోయిన్ నయనతార నార్త్ ఇండియాకు చెందినవారు.

దర్శకుడు అట్లీ నార్త్ వెర్షన్ కు ఉంచిన సీన్లు బాలీవుడ్ వెర్షన్ లో ట్రిమ్ చేయించినట్టు తెలుస్తుంది. కమెడియన్ యోగి బాబుతో ఉన్న సీన్లు తెలుగు, తమిళ భాషల్లో ఉన్నాయి.. వాటిని బాలీవుడ్ వెర్షన్ లో కట్ చేయించినట్టు తెలుస్తోంది. అంటే జవాన్ తమిళ తెలుగు వెర్షన్ లో ఉన్న కొన్ని సీన్లు బాలీవుడ్ వెర్షన్ లో లేవని చెప్పాలి. బాలీవుడ్ లో సినిమా ల్యాగ్‌ కాకుండా ఉండేందుకే అక్కడ యోగిబాబు సీన్లు అన్ని ట్రిమ్‌ చేయించారని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news