Moviesఆయ‌న అంద‌రి మోజు తీరుస్తున్నాడు.. రాఘ‌వేంద్ర‌రావును హీరోయిన్ అంత మాట అనేసిందేంటి..!

ఆయ‌న అంద‌రి మోజు తీరుస్తున్నాడు.. రాఘ‌వేంద్ర‌రావును హీరోయిన్ అంత మాట అనేసిందేంటి..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గురించి ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో రకాల ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అసలు ఎలాంటి హీరోయిన్ కు అయినా తిరుగులేని క్రేజ్ రావాలి అంటే కచ్చితంగా రాఘవేంద్రరావు సినిమాలో నటించాలి. రాఘవేంద్రరావు సినిమాలలో గ్లామర్ పాత్రలు చేయాలి అన్నంతగా ఆయన పాపులారిటీ ఉండేది. రాఘవేంద్రరావు హీరోయిన్లను ఎన్ని కోణాలలో ? ఎంత అందంగా చూపిస్తారో తెలిసిందే. ఆయన చేతిలో పడ్డాకే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు అయ్యారు.

ఆ హీరోయిన్ల లిస్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అలాగే ఆయన ఎంతోమందిని డైరెక్టర్లుగా తయారు చేశారు. తాజాగా రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థలో వస్తున్న సినిమా సర్కార్ నౌకరి. ఇందులో సింగర్ సునీత కొడుకు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ హైదరాబాదులో నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా హీరోయిన్ భావన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాను ఓ ప్రైవేటు సంస్థల ఉద్యోగం చేసుకునే అమ్మాయిని అని.. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో థియేటర్ ఆర్టిస్టుగా చేరాను.. కానీ అనుకోకుండా నాకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది. రాఘవేంద్రరావు గారికి కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయాలన్న‌ మోజు ఇంకా తీరలేదు.. అందుకే సినిమాల్లోకి రావాలన్నా ఉత్సాహంతో ఉన్న మాలాంటి వారి మోజు తీరుస్తున్నారంది.

ఆయన వల్ల ఎంతో మంది కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు అంటూ కామెంట్ చేసింది. ఇక్కడ భావన వ్యాఖ్యల అర్థం తమలాంటి కొత్త తరాన్ని ఆయ‌న‌ బాగా ప్రోత్సహిస్తున్నారు అన్నది.. అయినా ఆమె మోజు తీరుస్తున్నారు అని మాట్లాడడంతో నెటిజన్లు సరదాగా భావ‌న కామెంట్స్‌పై సెటైర్లు వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news