Moviesమ‌హేష్‌బాబు - సౌంద‌ర్య కాంబినేష‌న్లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ...

మ‌హేష్‌బాబు – సౌంద‌ర్య కాంబినేష‌న్లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దివంగత సీనియర్ హీరోయిన్ సౌందర్య కాంబినేషన్లో ఒక సూపర్ హిట్ సినిమా మిస్సయింది. ఈ విషయం చాలామందికి తెలియదు.. ఎస్ రెండున్నర దశాబ్దాల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఆలీ, ఇంద్రజ హీరో, హీరోయిన్లుగా నటించగా కైకాల సత్యనారాయణ యముడు పాత్రలో నటించారు.

ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక ఆలీ హీరోగా చాలా సినిమాల్లో నటించారు. ఇంద్రజ సైతం హీరోయిన్ గా టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో నటించింది. ఎస్వీ. కృష్ణారెడ్డి కెరీర్ లో ఇది ఒక్క‌ మెమరబుల్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా కథను ఎస్వీ కృష్ణారెడ్డి తయారుచేసి మొదటిగా హీరోగా మహేష్ బాబు, సౌందర్య హీరోయిన్‌గా తెరకెక్కించాలని అనుకున్నారు.

అయితే ఈ సినిమా సమయానికి మహేష్ బాబు వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే..! అప్పటికి సౌందర్య వయసు 22 ఏళ్లు. మహేష్ బాబు కన్నా సౌందర్య మూడు సంవత్సరాలు పెద్దది. అయితే సూపర్ స్టార్ కృష్ణకు ఈ కథ వినిపించగా కథ చాలా బాగుంది. అయితే మహేష్ చిన్నపిల్లాడు.. అప్పుడే ఇలాంటి పెద్ద కథలో నటిస్తాడా.. వేరే హీరోతో చేస్తే బాగుంటుందని ఎస్వీ. కృష్ణారెడ్డి తో చెప్పారట కృష్ణ.

ఆ తర్వాత ఐదేళ్లకి రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబును హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా సౌందర్య తో కలిసి నటించే అవకాశం మహేష్ బాబుకు చేజారిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news