Moviesచీర‌క‌ట్టులో ఆ పాట‌కు డ్యాన్స్ అద‌ర‌గొట్టిన త‌ల్లికూతుళ్లు సురేఖ - సుప్రీత...

చీర‌క‌ట్టులో ఆ పాట‌కు డ్యాన్స్ అద‌ర‌గొట్టిన త‌ల్లికూతుళ్లు సురేఖ – సుప్రీత ( వీడియో)

ప్ర‌ముఖ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి, ఆమె కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్దరూ ప్రముఖ పాటలకు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో వారి అభిమానుల‌తో పంచుకుంటారు. ఇక ఈ వ‌య‌స్సులో కూడా సురేఖ‌వాణి త‌న కుమార్తెతో క‌లిసి గ్లామర్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఈ క్ర‌మంలోనే ఈ త‌ళ్లికూతురు అమ్రిష్ స్వరపరిచిన తాజా చార్ట్‌బస్టర్ సమ్మోహనుడా పాటకు కొత్త రీల్ డ్యాన్స్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ క్ర‌మంలోనే ఈ తల్లీకూతుళ్ల డ్యాన్సులు ఇంటర్నెట్‌లో ఒక రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది.

ఇప్పటికే ఈ రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 60 వేలకు పైగా లైక్‌లు సొంతం చేసుకుంది. ఇక కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్న బిగ్ బాస్ రాబోయే సీజన్ లో సురేఖ, సుప్రీత పాల్గొంటారని కూడా ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news