Moviesజాక్ పాట్ ఆఫర్ అందుకున్న రష్మిక మందన్నా..పుష్ప కి అమ్మ మొగుడు...

జాక్ పాట్ ఆఫర్ అందుకున్న రష్మిక మందన్నా..పుష్ప కి అమ్మ మొగుడు లాంటి ఛాన్స్ ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.. గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక ప్రజెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది . ఇప్పటికే టాలీవుడ్లో పుష్ప2 సినిమా షూట్లో బిజీగా ఉన్న రష్మిక మందన్నా.. కోలీవుడ్లో విక్రమ్ సరసన ఓ సినిమాలో ఫిక్స్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది .

తాజాగా బాలీవుడ్లో అమ్మడు జాక్పాట్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది . బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో నటిస్తున్న షారుఖ్ .. ఆ తర్వాత మరొక క్రేజీ ప్రాజెక్టులో భాగం కానున్నారు . ఈ ప్రాజెక్టు కోసం హీరోయిన్గా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట మేకర్స్ .

ఒకవేళ ఇది నిజమైతే మాత్రం నిజంగా వేణు స్వామి చెప్పిందే జరగబోతుంది అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రష్మిక ఇండస్ట్రిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది అని చెప్పుకొచ్చారు . ప్రజెంట్ ఇప్పుడు అదే సిచువేషన్స్ కనిపిస్తున్నాయి . . ఒకపక్క సినిమాలు ఫ్లాప్ అవుతున్న అమ్మడుకు మాత్రం అవకాశాలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి ప్రెసెంట్ రష్మిక పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news