Newsరాజమౌళి ఆ హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం.. కానీ సినిమా...

రాజమౌళి ఆ హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం.. కానీ సినిమా చేయడు.. ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సినిమా ఇండస్ట్రీలోనే దర్శకధ్రుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువగానే కనిపిస్తుంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చేలా చేసింది ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పాలి. మరి ముఖ్యంగా బాహుబలి సినిమాతో ఆయన సూపర్ స్టార్ డైరెక్టర్గా మారిపోయారు .

అంతేకాదు ఆర్ఆరార్ తో ఏకంగా కోట్లాదిమంది ఇండియన్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అంటూ చూసిన ఆస్కార్ అవార్డు సైతం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో రాజమౌళికి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట వైరల్ గా మారుతుంది . అయితే ఎంతో మంది ఫేవరెట్ గా మారిన రాజమౌళికి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

అయితే రాజమౌళికి నిత్యామీనన్ అంటే చాలా చాలా ఇష్టమట . పేరుకి మలయాళ కుట్టినే అయినా తెలుగులో చాలా సినిమాలో నటించింది . ఆమె నటించిన ప్రతి సినిమాల్లో సూపర్ డూపర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది . ఈ క్రమంలోనే రాజమౌళి సైతం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”హీరోయిన్ నిత్యామీనన్ నటన అంటే చాలా ఇష్టం .. ఆమె నేచురల్ గా యాక్ట్ చేస్తుంది అని చెప్పుకు వచ్చారు.

అంతేకాదు ఆమెను మీ సినిమాలో పెట్టుకునే ఛాన్స్ ఇస్తారా..? అంటే నో అని చెప్పాడు రాజమౌళి. దానికి కారణం తాను చూస్ చేసుకునే హీరోలు అందరూ కూడా గట్టిగా – పుష్టిగా – స్ట్రాంగ్ గా ఉండే హీరోస్ అని ..అయితే వాళ్ల మధ్య నిత్యామీనన్ సెట్ అవ్వకపోవచ్చు అనే సందేహం వ్యక్తం చేశాడు . డైరెక్ట్ గా చెప్పాలంటే నిత్యామీనన్ పొట్టిగా ఉంటుందని ఆ కారణంగానే రాజమౌళి సినిమాలోకి తీసుకోలేకపోతున్నాను అని చెప్పుకొచ్చాడు. కానీ అదే విషయాన్ని ఆయన అలా చెప్పకుండా పరోక్షంగా సూట్ అవ్వదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news