Movies"నేను వెకేషన్ కి వెళ్ళితే .. మీకు ఏంటి నొప్పి".. ఇచ్చిపడేసిన...

“నేను వెకేషన్ కి వెళ్ళితే .. మీకు ఏంటి నొప్పి”.. ఇచ్చిపడేసిన మహేశ్ బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంత జోవియల్ గా ఉంటారో మనందరికీ బాగా తెలిసిన విషయమే . అస్సలు కోప్పడరు. తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు . తనపై సెటైర్ వేస్తే మాత్రం తిరిగి కౌంటర్ ఇచ్చేదాకా వదలడు ఈ సూపర్ స్టార్ హీరో. రీసెంట్గా అలాంటి సిచువేషన్ ఎదురయింది . సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఓ వైపు సినిమాలు మరోవైపు పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే.

బిగ్ చ్ 12వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది . దీంతో బిగ్ సి కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేష్ బాబు ఆ వార్షికోత్సవ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మహేష్ ముందు రిపోర్టర్ లు అనుమానాలను ప్రశ్నలుగా సంధించారు. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ లో మీ ఫొటోస్ ను అక్కడ ఫోటోగ్రాఫర్లు ట్రిప్ 1 అండ్ ట్రిప్ 2 అండ్ ట్రిప్ 3 అంటూ ఫోటోలు తీసి పెడుతున్నారు ..అలా వెకేషన్స్ కి వెళ్లడం ఏంటి..? అని జనాలు అనుకోవడం మీ వరకు వచ్చిందా..? అన్న క్వశ్చన్ రిపోర్టర్ నేరుగా మహేష్ బాబును అడిగారు.

దీనికి చాలా ఫన్నీగా మహేష్ బాబు ఆన్సర్ ఇచ్చాడు . “నేను వెకేషన్ కి వెళ్తున్నానని నేనే చెప్తున్నానుగా.. నేనే నా ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను . నా వెకేషన్ చూసి మీరేమైనా జలసిగా ఫీల్ అవుతున్నారా ..? అంటూ కౌంటర్ వేశారు నవ్వుతూ. మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేస్తూ పోర్టర్ “మీరు వెకేషన్ కి వెళ్లడం కొంతమందికి నచ్చడం లేదు అన్నమాట ఎక్కువగా వినిపిస్తుంది . ఆ కామెంట్స్ మీ వరకు వచ్చాయా ..?”అని ప్రశ్నించారు .

దీంతో మహేష్ బాబు చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. “నేను వెకేషన్ కి వెళ్తే మీకు నచ్చాల్సిందేముందండి ” అంటూ చాలా ఫన్నీగా ఎవరికి ఎక్కడ తగలలో అక్కడ తగిలేలా మాట్లాడాడు. ఈ కామెంట్స్ ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . మహేష్ చెప్పింది నిజమే కదా.. ఆయన డబ్బు.. ఆయన టైం ఆయన ఫ్యామిలీ ఆయన వెళ్తున్నాడు మధ్యలో ఈ పని పాట లేని బ్యాచ్ కి నొప్పి ఏంటి..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ కి సంబంధించిన డౌట్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . మొత్తానికి తన వెకేషన్ పై పాయింట్ అవుట్ చేసే ప్రతి ఒక్కరికి ఇచ్చి పడేసాడు మహేష్ బాబు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news