Moviesమళ్లీ చెల్లిగా కీర్తి సురేష్..ఈసారి బలి అయ్యేది ఏ హీరో అంటే..?

మళ్లీ చెల్లిగా కీర్తి సురేష్..ఈసారి బలి అయ్యేది ఏ హీరో అంటే..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో మహానటి గా పాపులారిటి సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మరోసారి సిస్టర్ గా నటించబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే రెండు సినిమాల్లో సిస్టర్ గా నటించి ఇద్దరు హీరోలకి బిగ్ డిజాస్టర్ లు ఇచ్చిన కీర్తి సురేష్ ఈసారి సూపర్ సక్సెస్ ఫుల్ నటుడిగా పేరు సంపాదించుకున్న అజిత్ కి ఫ్లాప్ ఇవ్వబోతుందట.

యస్.. అజిత్ నెక్స్ట్ సినిమాలో కీర్తి సురేష్ సిస్టర్ గా కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించబోతుంది అంటూ తెలుస్తుంది . ఇప్పటికే కీర్తి సురేష్ సిస్టర్ గా నటించిన రెండు సినిమా పరమ చెత్త టాక్ నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు కీర్తి సురేష్ సిస్టర్ గా నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు .

అలా అయితే ఈసారి డిజాస్టర్ అందుకోబోయేది కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు. గతంలో రజనీ కాంత్ పెద్దన్న సినిమాలో కీర్తి సిస్టర్ గా నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో సిస్టర్ గా నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఏమో అజిత్ సినిమాలో సిస్టర్ గా కనిపించబోతుంది..? దీంతో మరోసారి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news