Movies"నోరు మూసుకుని కామెంట్ ని డిలిట్ చెయ్".. ఫస్ట్ టైం సీరియస్...

“నోరు మూసుకుని కామెంట్ ని డిలిట్ చెయ్”.. ఫస్ట్ టైం సీరియస్ అయిన సాయి ధరమ్ తేజ్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో ఆకతాయిలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు . ఆమె మంచి చేసిన చెడు చేసిన.. ఫోటో పోస్ట్ చేసిన ఫోటో పోస్ట్ చేయకపోయినా.. బూతులు తిడుతున్నారు. ఇలాంటి క్రమంలోనే నిహారిక పెట్టిన కామెంట్ ని టార్గెట్ చేస్తూ ఓ నెటిజెన్ ఆమె పరసనల్ లైఫ్ ని టచ్ చేసాడు.

రీసెంట్గా సాయిధరమ్ తన స్నేహితుడు సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కోసం ఓ ప్రైవేట్ సాంగ్ లో నటించాడు . స్వాతి రెడ్డి తో కలిసి సత్యా అనే సాంగ్ లో నటించి మెప్పించాడు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది . సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది . అయితే ఈ సాంగ్ అప్డేట్ ఇస్తూ సాయిధరమ్ తేజ్ ఓ పోస్ట్ పెట్టాడు . ఆ పోస్ట్ కి నిహారిక రిప్లై ఇస్తూ “ఈ సాంగ్ చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ” అంటూ కామెంట్ పెట్టింది.

సాయి తేజ్ పెట్టిన పోస్ట్ కి నిహారిక ఇచ్చిన రిప్లై కి అసలు ఆ నెటిజన్ అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు . కానీ కావాలనే టార్గెట్ చేస్తూ నిహారిక పరసనల్ లైఫ్ ని టచ్ చేసాడు . “వీటి పై పెట్టిన ధ్యాస నీ ఫ్యామిలీ పై పెట్టి ఉంటే బాగుండేది ” అంటూ నిహారిక వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించాడు. దీంతో సాయి ధరమ్ తేజ్ కి తీవ్ర కోపం వచ్చింది. అంతే వెంటనే రియాక్ట్ అవుతూ..”నోరు మూసుకొని వెంటనే కామెంట్ డిలీట్ చెయ్” అంటూ ఆకతాయికి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చాడు . తేజు ఫ్యాన్స్ కూడా సదరు నెటిజన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఎందుకు ప్రతి విషయం నిహారికనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంస్కారం లేని మనుషులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news