Newsహీరోయిన్ ట‌బు చీర ఇస్త్రీ చేసే స్టేజ్ నుంచి ఈ రోజు...

హీరోయిన్ ట‌బు చీర ఇస్త్రీ చేసే స్టేజ్ నుంచి ఈ రోజు స్టార్ డైరెక్ట‌ర్‌గా..!

ఒక హీరోయిన్ చీరలు ఇస్త్రీ చేసే రేంజ్ నుంచి డైరెక్టర్ అయి.. దేశం గర్వించే గొప్ప డైరెక్టర్ రేంజ్ కు ఎదగటం… అంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి గురించి అందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ,బాధలు ఎదుర్కొన్న రోహిత్ శెట్టి ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఒక స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. సినిమాల్లో ఒక వెలుగు వెలగాలన్న కోరికతో ముంబైలో అడుగుపెట్టిన రోహిత్ శెట్టి కెరీర్ ప్రారంభంలో చాలా అంటే చాలా కష్టాలు పడ్డాడట.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సీనియర్ హీరోయిన్ టబు చీరలను ఐరన్ కూడా చేశాడట. ఆ స్టేజి నుంచి ప్రారంభమైన రోహిత్ శెట్టి.. ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. మొదట్లో రోహిత్ శెట్టి రెమ్యూనరేషన్ కేవలం 35 రూపాయలు మాత్రమే. సినిమాలపై ఇష్టంతో ఎలాగైనా బాలీవుడ్లో సెటిల్ అవ్వాలని ఎలాంటి కష్టమైన పనులైనా చేసేవాడట.

కేవలం 17 ఏళ్ళ వయసులోనే పోల్ ఆర్ కాంటే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇక రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఇటీవల కాలంలో వచ్చిన సూర్యవంశం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కత్రినా కైఫ్ జంటగా నటించారు.

ఇక రోహిత్ శెట్టి ఎప్పుడూ ఖాళీగా ఉండడు ఏదో ఒక పనిలో బిజీ బిజీగానే కొనసాగుతుంటాడు. రోహిత్ శెట్టి ఏడాదికి రు. 35 నుంచి 45 కోట్ల వరకు ఆస్తి సంపాదిస్తాడట. అతడు ఆస్తి మొత్తం విలువ రు. 300 కోట్ల పై మాటే. అలాగే ఒక సినిమాకు దర్శకత్వం వహించినందుకు గాను రోహిత్ శెట్టికి రు. 25 కోట్ల రెమ్యూనరేషన్ దక్కుతుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news