Newsమ‌హేష్‌బాబు డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్ సినిమా..!

మ‌హేష్‌బాబు డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్ సినిమా..!

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా భోళా శంకర్. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. ఇక చిరు త‌న త‌ర్వాత కుర‌సాల క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ళ‌యాళ హిట్ సినిమా బ్రో డాడీకి రీమేక్‌గా ఓ సినిమా చేస్తున్నాడంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ సినిమాను గోల్డెన్ బాక్స్ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరు పెద్ద కుమార్తె కొణిదెల సుస్మిత నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు భోళాశంక‌ర్ ఎఫెక్ట్‌తో చిరు మ‌రో రీమేక్ చేసేందుకు సిద్ధంగా లేడ‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే చిరు క్రేజీ లైన‌ప్‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ అయ్యింది.

కోలీవుడ్ ద‌ర్శ‌కుడు ఏఆర్. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ప్రాజెక్టు తెర‌కెక్క‌నుంది. గ‌తంలో చిరు – మురుగ‌దాస్ కాంబోలో వ‌చ్చిన స్టాలిన్ సినిమా క‌థా ప‌రంగా బాగున్నా సినిమా అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. ఇక 2017లో మ‌హేష్ – మురుగ‌దాస్ కాంబోలో వ‌చ్చిన స్పైడ‌ర్ పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది.

ఇక ఇప్పుడు చాలా గ్యాప్ త‌ర్వాత మ‌రోసారి మురుగ‌దాస్ తెలుగులో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అది కూడా చిరంజీవితో కావ‌డం మ‌రో విశేషం. మురుగదాస్ కోలీవుడ్ “దర్బార్” తర్వాత లాంగ్ గ్యాప్ త‌ర్వాత కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మ‌రి చిరుకు ఈ సారి అయినా మురుగ‌దాస్ త‌న రేంజ్‌కు త‌గ్గ హిట్ ఇస్తాడేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news