Moviesరామ్‌ గురించి టాప్ సీక్రేట్ బయటపెట్టిన నటసింహం.. స్కంద ఈవెంట్‌లో బాలయ్య...

రామ్‌ గురించి టాప్ సీక్రేట్ బయటపెట్టిన నటసింహం.. స్కంద ఈవెంట్‌లో బాలయ్య ఊరమాస్ డైలాగ్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే . వాళ్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు నందమూరి బాలయ్య ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు. కాగా రీసెంట్గా రామ్ నటించిన స్కంద సినిమా ఈవెంట్లో పాల్గొన్న బాలయ్య తనదైన స్టైల్ లో స్పీచ్ ఇచ్చి అదరగొట్టేసాడు. రామ్ పోతినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో గ్రాండ్గా జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు బాలకృష్ణ .

ఈ క్రమంలోనే ఆయన రాంపోతినేని ను ఓ రేంజ్ లో పొగిడేసారు . బాలకృష్ణ మాట్లాడుతూ..” రామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే తెలంగాణ యాస భాషలో ఇస్మార్ట్ శంకర్ తీసిన సవాల్ విసిరాడు ..నేను ఇప్పుడు భగవంత్ కేసరితో ప్రతి సవాల్ విసిరుతున్నాను.. మళ్లీ ఆయన డబుల్ ఇస్మార్ట్ అంటూ నాకు సవాల్ విసిరుతున్నాడు . ఈ విషయంలో ఆయనది పిహెచ్డి అయిపోయింది . నేను ఇంకా డిగ్రీనే చదువుతున్నాను. ఆయనని నేను చూసి ఫాలో అవుతున్నాను” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తాడు .

దీనికి రామ్ ..” నేను చదివే స్కూల్లో మీరు పిహెచ్డి మాస్టర్ సార్ “అంటూ చెప్పుకు వస్తారు . దీంతో బాలయ్య ఉప్పొంగి పోతారు . అనంతరం మళ్లీ బాలయ్య మాట్లాడుతూ ..రామ్ మహా తిక్క అంటూ టాప్ సీక్రేట్ ని బయట పెట్టాడు. ” 2006లో ఆయన జర్నీ ప్రారంభమైందని మొదటి సినిమాకి నేనే గెస్ట్ గా వెళ్లాను అని.. ఈ జర్నీలో రామ్ ఎన్నో మంచి సినిమాలు చేసుకోవచ్చాడని సినిమా ఇండస్ట్రీకి రాం లాంటి హీరోలు కావాలని చెప్పుకొచ్చారు . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న శ్రీలీలను పొగిడేసారు . అందం నటన అభినయం కలగలిపిన అమ్మాయి మన శ్రీ లీల అని తెలుగమ్మాయి కావడం మరింత గర్వకారణంగా ఉందని చెప్పుకొచ్చారు . శ్రీ లీల ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి వెళ్తుంది ” అంటూ హామీ ఇచ్చాడు ధీమా వ్యక్తం చేశాడు బాలయ్య . ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news