Moviesఆ విషయంలో లిమిట్స్ క్రాస్ చేసిన శ్రీలీల..స్టేజ్ పైనే వార్నింగ్ ఇచ్చిన...

ఆ విషయంలో లిమిట్స్ క్రాస్ చేసిన శ్రీలీల..స్టేజ్ పైనే వార్నింగ్ ఇచ్చిన బోయపాటి.. ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రిలో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న బోయపాటి శ్రీనుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే . ఆయనతో సినిమా చేస్తే ఆ హీరోకి మాస్ ఎలివేషన్ వస్తుంది అన్న నమ్మకం అందరికీ ఉంది . ఇప్పటివరకు బోయపాటి శ్రీను తీసిన సినిమాలలో అందరి హీరోలు అలాంటి మాస్ ఎలివేషన్ అందుకున్నారు. మరి ముఖ్యంగా బాలయ్య బోయపాటి కాంబో అంటే సిల్వర్ స్క్రీన్ బద్దలు అవ్వాల్సిందే అన్న రేంజ్ లో మార్క్ సెట్ చేసి పెట్టారు బోయపాటి శ్రీను .

రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన సినిమా స్కంద ..ఈ సినిమాలో హీరోగా నటించాడు రామ్ . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ గా శ్రీలీల నటించింది . ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్గా జరిగింది . ఈ క్రమంలోనే ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా బాలయ్య అటెండ్ అయ్యారు . బాలయ్య అనంతరం స్టేజ్ పైకి వచ్చిన బోయపాటి మాట్లాడుతూ ..రామ్ పోతిరిని ..బాలయ్యను ఓ రేంజ్ లో పొగిడేసారు .

అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న శ్రీలీల గురించి నాలుగు ముక్కలు మాట్లాడారు . అంతేకాకుండా ఆమెకు స్ట్రైట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అది ఆమె మంచి కోసమే. ” శ్రీలీలను అందరూ గ్లామర్ బ్యూటీ అంటున్నారు కాదు ఆమె పరిపూర్ణమైన ఆర్టిస్ట్ ..ఎలాంటి పాత్రలు అయినా చేయగలిగే నటి ఎవరైనా హీరోయిన్ కనిపిస్తే ఏ హీరోతో చేస్తున్నావ్ అని అడుగుతాం ..కానీ శ్రీలీల కనిపిస్తే నువ్వు ఏ హీరోతో చేయట్లేదు అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది “అంటూ సెటైర్ వేశారు. అంతేకాదు ఇలాగే ముందుకెళ్లు కాకపోతే మరీ ఎక్కువ పరిగెడితే గ్లామర్ దెబ్బతింటుంది జాగ్రత్త అంటూ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. దీనితో సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news