Movies"స్కంద" ట్రైలర్ రిలీజ్..అచ్చం ఆ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ లాగే ఉందిగా(వీడియో)..!!

“స్కంద” ట్రైలర్ రిలీజ్..అచ్చం ఆ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ లాగే ఉందిగా(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రిలో ఎనర్జిటిక్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాం పోతినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా స్కంద . మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది . రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . అయితే ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం బోయపాటి శ్రీను చించేసాడనే చెప్పాలి .

తన మాస్ స్టైల్ మరోసారి ఎలివేట్ చేస్తూ రామ్ పోతినేని చేత మాస్ మాస్ డైలాగ్స్ చేప్పిచాడు. అంతేకాదు ఈ సినిమాకి హీరోయిన్ శ్రీలీల అందాలు ప్లస్ అవుతున్నాయి అంటూ చిన్న ట్రైలర్తోనే చెప్పేసాడు బోయపాటి శ్రీను . ఇది మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన మాస్ సినిమా అని అర్థమవుతుంది . ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది .

అయితే ఈ సినిమా ట్రైలర్ ని చూస్తుంటే ఎక్కడో జనాలకు బోయపాటి కెరియర్ లో డిజాస్టర్ గా మారిన రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సీన్స్ గుర్తొస్తున్నాయట. ప్రజెంట్ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే సింహ తేడా కొడితే వినయ్ విధేయ రామ అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news