Moviesఓ మంచి వ్య‌క్తి కెరీర్‌ను నిలువునా ముంచేసిన అక్కినేని అఖిల్‌…!

ఓ మంచి వ్య‌క్తి కెరీర్‌ను నిలువునా ముంచేసిన అక్కినేని అఖిల్‌…!

అక్కినేని అఖిల్ ఓ మంచి వ్యక్తి కెరీర్ను నిలువునా ముంచేశాడు.. అంటే అఖిల్ ఆ మంచి వ్య‌క్తిని ఏదో చేయలేదు. అఖిల్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్ ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో దాదాపు మూడు సంవత్సరాలు పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై ఎందుకో ? గాని రిలీజ్ కు ముందు నుంచే ఎవరికీ అంచనాలు లేవు

అయితే ఈ సినిమా ఏపీ, తెలంగాణ హోల్‌సేల్ హక్కులను వైజాగ్ కు చెందిన గాయత్రి డిస్ట్రిబ్యూటర్స్ అధినేత గాయత్రి సతీష్ సొంతం చేసుకున్నారు. దాదాపు రు. 30 కోట్ల చెల్లించి మరి ఆయన ఏపీ, తెలంగాణ రైట్స్ సొంతం చేసుకున్నారు. సినిమాకు పెట్టిన పెట్టుబడిలో కనీసం 10% కూడా రికవరీ కాలేదు. అంటే సతీష్ ఏకంగా 25 కోట్లకు పైగా నష్టపోయారని సమాచారం. పంపిణీదారుడుగా గాయత్రి సతీష్ కు ఉత్తరాంధ్ర ఏరియాలో మంచి పేరు ఉంది.

ఏజెంట్ సినిమా దెబ్బతో ఆయన జీవితకాలం సంపాదించినది మొత్తం కోల్పోయినట్టు డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన కొందరు నిర్మాతలు ఇటు అనిల్ సుంకరతో పాటు అటు గాయత్రి సతీష్ తో మాట్లాడి పరిష్కారం సూచించినట్టు తెలుస్తోంది. దీంతో అనిల్ సుంకర తన వంతు బాధ్యతగా రు. 8.50 కోట్లు వెనక్కి ఇవ్వటానికి అంగీకరించడంతో పాటు తాను ఈ మొత్తాన్ని ఆరు నెలల లోగా ఇస్తానని లిఖితపూర్వకంగా కూడా హామీ ఇస్తాను అని చెప్పారు అట.

అయితే గాయత్రి సతీష్ మాత్రం అమౌంట్ విషయంలో తనకు ఓకే అని.. అయితే ఆ అమౌంట్ తనకు ఇప్పుడే కావాలి లేదా తాను బాకీ ఉన్నవారికి అనిల్ సుంకర లేఖ ఇవ్వాలని చెప్పడంతో అందుకు అనిల్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా నిర్మాత అనిల్ సుంకర ఎనిమిదిన్నర కోట్ల మొత్తం వెనక్కి ఇవ్వటం మంచి విషయమే అయినా.. ఈ సెటిల్మెంట్ మధ్యలో ఆగిపోవడం గాయత్రి సతీష్ కు మరింత మైనస్ కానుందని ప్రచారం జరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news