Movies"బేబీ" నటి వైష్ణ‌వి చైత‌న్య రిజెక్ట్ చేసిన ఆ సూపర్...

“బేబీ” నటి వైష్ణ‌వి చైత‌న్య రిజెక్ట్ చేసిన ఆ సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..? విధిరాత అంటే ఇదే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . దానికి కారణం రీసెంట్ గా ఆమె నటించిన బేబీ సినిమా రిలీజ్ కావడమే . హృదయ కాలేయం సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా..విరాజ్ ఈ సినిమాలో మరో హీరోగా కనిపించాడు.

కాగా బ్యాక్ టు బ్యాక్ లవ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది.టైర్ 2 హీరోలు వసూలు చేసే కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీలో రికార్డును నెలకొల్పింది బేబీ సినిమా . అయితే ఈ బేబీ సినిమా ఇంతటి హిట్ అవ్వడానికి కారణం వైష్ణవి చైతన్య పర్ఫామెన్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే .

కాగా ఈ సినిమా కంటే ముందే వైష్ణవి చైతన్య మరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట. ఆమె హీరోయిన్గా “బలగం” అనే సినిమా ద్వారా వైష్ణవి చైతన్య తెరంగేట్రం చేసి ఉండాల్సింది . అయితే కథ అంతా విన్నాక ఈ సినిమాని వైష్ణవి చైతన్య రిజెక్ట్ చేసిందట . వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి – కావ్య కళ్యాణ్రామ్ జంటగా నటించారు . దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news