Moviesసితార యాడ్ చూసారా.. ప్రిన్సెస్‌ కాదు మహారాణీ.. కుందనపు బొమ్మ కూడా...

సితార యాడ్ చూసారా.. ప్రిన్సెస్‌ కాదు మహారాణీ.. కుందనపు బొమ్మ కూడా తక్కువే..(వీడియో)..!!

కోట్లాదిమంది ఘట్టమనేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే సితార ఘట్టమనేని తన కెరియర్ లో ఫస్ట్ చేసిన యాడ్ రిలీజ్ అయ్యింది. మనకు తెలిసిందే సితార ఘట్టమనేని జువెలరీ యాడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది . రీసెంట్ గానే యాడ్ కూడా షూట్ చేశారు మేకర్స్ . ఇదే క్రమంలో కొద్ది సేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా పీఎంజే జ్యువలరీ తన ఆడ్ ను రిలీజ్ చేసింది. కాగ సితార ఈ యాడ్ లో చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంది.

అసలు తన వయసుకు మించిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఘట్టమనేని ఫ్యాన్స్ కు షాకింగ్ గా అనిపించింది . సితార పాప కు సినిమాలంటే ఇష్టమే అది ఓకే కానీ ఇంత చిన్న వయసులోనే ఇంత మెచ్యూర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం నిజంగా తాత – నాన్న దగ్గర నేర్చుకుంది అంటూ కృష్ణను మహేష్ బాబును ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అంతేకాదు సితార ఏజ్ కి ఈ యాడ్ చాలా బాగా మ్యాచ్ అయింది . కాగా నిజానికి సితారను ఓ ఫిలిం ద్వారా ఇంట్రడ్యూస్ చేసి ఉంటే ఇంత క్రేజ్ ఇంత పబ్లిసిటీ గక్కక పోయొఉండకపోవచ్చు .

మొదటిగా యాడ్ ఫీలిం ద్వారా సితారను ఇండస్ట్రీలో లాంచ్ చేయడం నిజంగా సితారకు ప్లస్ పాయింట్ అయింది అంటున్నారు అభిమానులు.. సామాన్య జనాలు కూడా ఈ యాడ్ ని పదేపదే చూస్తున్నారు అంటే సితార అభిమానుల్ని ఎంతలా అట్రాక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా సితార ఈ జ్యువెలరీ యాడ్ లో అచ్చం ప్రిన్సెస్ లా ఉంది . కాదు కాదు మహారాణి లానే ఉంది అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ . దీంతో సితార చేసిన ఫస్ట్ జువెలరీ యాడ్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news