Movies"ఆలియాకు హగ్గు..అది మాత్రం మీ వదినకే"..రణవీర్ బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

“ఆలియాకు హగ్గు..అది మాత్రం మీ వదినకే”..రణవీర్ బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

కొన్నిసార్లు సినిమా ఇండస్ట్రీలో మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు వాటిని లైట్గా తీసుకొని మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీలో మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది . అప్పుడే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కుతుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో అలియా భట్ – రన్వీర్ సింగ్ లకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రన్వీర్ సింగ్ భార్య దీపిక పదుకొనే అలియా భట్ భర్త రన్బీర్ కపూర్ గాఢంగా ప్రేమించుకుని కొంతకాలం డేటింగ్ చేసి విడిపోయారు . సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన పిక్స్ కూడా ట్రెండ్ అయ్యాయి .

అయితే మన లైఫ్ పార్ట్నర్స్ మాజీ లవర్స్ తో కలిసి ఓ సినిమా లో నటిస్తే భలే క్రేజీ గా ఉంటుంది . ప్రజెంట్ అలాంటి ఓ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు రణవీర్ సింగ్ – అలియాభట్ . రీసెంట్ గానే అలియా పండు లాంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా సినిమాలో చేస్తుంది . అలియా భట్ రీసెంట్గా రాఖీ రాఖీ ఔర్ రాఖీ ప్రేమ్ కహాని అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో హీరోగా నటించాడు రణవీర్ సింగ్.

ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ లో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ దర్శకత్వం రూపొందించిన ఈ సినిమా ఫుల్ టు ఫుల్ లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎమోషన్స్ గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఢిల్లీలోని వీధుల్లో చక్కర్లు కొట్టారు అలియాభట్ రన్వీర్ సింగ్ . ఈ క్రమంలోనే అలియాభట్ కి ఓ అభిమాని ఝుంకాలు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే వెంటనే నీకు ఏం కావాలి అని రణ్వీర్ అడగడంతో హగ్ కావాలి అంటాడు. హగ్ అలియా కో దేదే, ఝుమ్కా ముఝే దేదే. తేరీ భాభి బాహోత్ ఖుష్ హో జాయేగీ అని అన్నారు. అంటే హగ్ ఆలియాకు ఇవ్వు.. నాకు మాత్రం ఆ ఝుంకాలు ఇవ్వు.. మీ వ‌దిన‌ దీపికా పదుకొనే కి ఇస్తే ఫుల్ ఖుషీ అవుతుంది అని అన్నారు రణ్‌వీర్. ఈస్టార్ హీరో చేసిన కామెడీకి అక్కడ ఉన్నవారే కాదు.. ఈ వీడియోలు సోషల్ మీడియలో చూస్తున్న నెటిజన్లు కూడా ఫన్ ఫీల్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news