Newsహిట్ ఇచ్చిన సినిమానే ఇంటి పేరుగా పెట్టుకున్న టాప్ 10...

హిట్ ఇచ్చిన సినిమానే ఇంటి పేరుగా పెట్టుకున్న టాప్ 10 సెలబ్రిటీస్ వీళ్లే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు భలే విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. మనకి హిట్ ఇచ్చిన సినిమానే మర్చిపోలేక ఆ సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకుంటూ ఉంటారు కొందరు స్టార్ సెలబ్రెటీస్ . అలాంటి వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

అల్లరి నరేష్: సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్.. అల్లరి అనే సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఈ క్రమంలోనే ఆయనకు హిట్ ఇచ్చి కెరియర్ ఇచ్చిన సినిమా పేరు నే తన ఇంటిపేరుగా అల్లరి నరేష్ అని మార్చుకునేసాడు .

దిల్ రాజు: దిల్ రాజు ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు . ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న వాళ్లలో దిల్ రాజు టాప్ ప్లేస్ లో ఉంటారు . కాగా నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన దిల్ సినిమా హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాత రాజు కావడంతో ఆయన ఇంటిపేరు మాఎచేసుకున్నాడు . ఇప్పటికీ మామూలుగా రాజు అంటే ఎవరికి తెలియదు దిల్ రాజు అంటేనే అందరికీ టక్కున ఐడెంటిఫై అవుతుంది.

సత్యం రాజేష్ : సత్యం రాజేష్ సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రాజేష్ ఈ సినిమా తర్వాత సత్యం రాజేష్ గా మారిపోయారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో సత్యం రాజేష్ గానే పాపులారిటీ సంపాదించుకున్నాడు .

సిరివెన్నెల సీతారామశాస్త్రి : మహాకావ్యం సిరివెన్నెల సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చెప్పే కొద్ది పేజీలు పేజీలు తిరగరాయాల్సిందే. అలాంటి సరికొత్త చరిత్ర సృష్టించీంది. దీంత్ఫ్ ఇంటి పేరు సిరివెన్నెల సీతారామశాస్త్రి గా మారిపోయింది.

బొమ్మరిల్లు భాస్కర్ : ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ భాస్కర్ . ఈ సినిమాతో ఫస్ట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో ఏకంగా తన ఇంటి పేరును బొమ్మరిల్లుగా మార్చుకొని బొమ్మరిల్లు భాస్కర్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు .

జబర్దస్త్ మహేష్ : జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఈ సినిమాలో రామ్ చరణ్ కి స్నేహితుడిగా కనిపించి తనదైన స్టైల్ లో నటించిన మహేష్ మొదటి సినిమా ఇదే . ఈ క్రమంలోని ఫస్ట్ సినిమాని సూపర్ డూపర్ హిట్ కావడంతో ఏకంగా అతగాడి ఇంటి పేరుని రంగస్థలం గా మార్చుకొని రంగస్థలం మహేష్ గా పిలిపించుకుంటున్నారు .

చత్రపతి శేఖర్ : శేఖర్ ఎప్పటినుంచో సినిమాలో కొనసాగుతున్నారు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాల్లోనూ తనదైన స్టైల్ లో నటించిన మెప్పించారు . కానీ చత్రపతి ద్వారా ఆయన యాక్టింగ్ ఫేమస్ కావడంతో అందరికీ ఆయన చత్రపతి శేఖర్ గా మారిపోయాడు . ఇప్పటికే చత్రపతి శేఖర్ గానే పిలిపించుకుంటున్నారు.

దేవిశ్రీప్రసాద్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ గురించి. కాగా ఈయన అసలు పేరు గంధం శ్రీ ప్రసాద్ . అయితే టీనేజ్ లోనే ఆయన దేవి అనే సినిమాకు సంగీత దర్శకుడుగా మారాడు . ఈ క్రమంలోని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఫస్ట్ సినిమాతోనే ఇంత హిట్ అందుకోవడంతో ఆ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. అప్పటినుంచి అందరూ ఇన్ని దేవిశ్రీప్రసాద్ డిఎస్పి అంటూ పిలుస్తూ వచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news