Moviesబాక్స్ ఆఫిస్ వద్ద "బేబీ" భీబత్సం.. 2డే ఎన్ని కోట్లు కలెక్ట్...

బాక్స్ ఆఫిస్ వద్ద “బేబీ” భీబత్సం.. 2డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా .. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో నటించిన సినిమా “బేబీ” . సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . ఈ సినిమాలో యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. నేటి జనరేషన్ ఫాస్ట్ కల్చర్ మోజులో ఎలా తప్పులు చేస్తున్నారు అనే విషయాన్నీ క్లియర్ కట్గా చూపించాడు యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ .

ఫుల్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ పాజిటివ్ హిట్ అందుకుంది. అంతేకాదు ఆనంద్ దేవరకొండ కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డులను కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఆంధ్ర తెలంగాణలో రెండవ రోజు కూడా భారీగా వసూళ్ళి రాబట్టిన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా మొదటి రోజు మొత్తంగా 2.98 కోట్లు షేర్ చేసి..బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా చరిత్ర సృష్టించింది.

ఓవర్ల్ ఆల్ గా చూసుకుంటే.. నైజాంలో రూ.2.55 కోట్లు, సీడెడ్ లో రూ.70 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.90లక్షలు, ఈస్ట్ గోదావరి లో రూ.38 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ.23 లక్షలు, గుంటూరులో రూ .32 లక్షలు, కృష్ణాలో రూ .32 లక్షలు, నెల్లూరులో రూ.18లక్షలు రాబట్టి చిన్న సినిమా కూదా పెద్ద కలెక్షన్స్ రాబట్ట కలదు అంటూ ప్రూవ్ చేసింది. ఇక మొత్తంగా కలుపుకుంటే రూ.5.58 కోట్ల షేర్ , రూ.9.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన బేబీ చిత్రం. ఇకపోతే ఈ సినిమా మరో రూ.96 లక్షలు రాబడితే క్లీన్ హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంటుంది అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద రెండు రోజుల కలెక్షన్ విషయానికి వస్తే రూ.14.3 కోట్ల రూపాయలు క్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news