Newsపవన్ "బ్రో" సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేసిన.. మన...

పవన్ “బ్రో” సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేసిన.. మన తెలుగు స్టార్ హీరో “బ్రో” ఇతనే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ఆఫర్స్ చెయ్యి జారిపోతూ ఉంటాయి. అయితే ఓసారి అలా చెయ్యి జారిపోవడం కూడా మంచి లక్ అనె చెప్పాలి. ప్రెసెంట్ అలాంటి లక్కీ హీరో ప్రభాస్ అంటూ పొగిడేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. మనకు తెలిసిందే ప్రభాస్ ఈ మధ్యకాలంలో హిట్ కొట్టిన సినిమాలే లేవు. కానీ హిట్ కొడితే ఏకంగా పాన్ ఇండియాలోనే హిట్ కొట్టాలి అంటున్నారు అభిమానులు . అయితే ఆయన వద్దకు వచ్చిన చిన్నాచితకా ఆఫర్ సినిమాలను రిజెక్ట్ చేసిన ఫ్యాన్స్ పెద్దగా బాధపడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన వద్దకు వచ్చిన ఆఫర్లు రిజెక్ట్ చేసి మంచి పని చేసాడు అంటూ నెట్టింట ఓ న్యూస్ వైరల్ గా మారింది.

ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమా పోస్టర్స్ టైటిల్స్ ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కోసం మొదట డైరెక్టర్ సముద్రఖని అనుకున్న హీరో ప్రభాస్ అంటూ తెలుస్తుంది . ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో ఈ సినిమాను ఒప్పుకోకపోయినా సరే ఏదో తన ఆత్రుత కొద్ది ఒకసారి ట్రై చేశారట . సాయి ధరమట్ తేజ్ పాత్రలో అఖిల్ ని అనుకున్నారట . అంతేకాదు పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన సినిమాను ఒప్పుకుంటాడో లేదో అంటూ అనుమానంగానే ఈ సినిమాను ఆయనకు చెప్పడానికి ట్రై చేశారట .

అయితే కథ వినకుండానే ప్రభాస్ ఈ పాత్రను రిజెక్ట్ చేశారట. పాన్ ఇండియా లెవెల్ లో హీరోగా పాపులారిటీ దక్కించుకున్న ఆయన ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవెల్లోనే నటించాలని అనుకుంటారు. అందుకే ఈ సినిమా రిజెక్ట్ చేస్తున్నాను అని క్లారిటీగా చెప్పుకొచ్చారట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య – కార్తీక్ లను కూడా అనుకున్నారట . అయితే వాళ్ళు ఇది తెలిసిన కధే కదా అంటూ రిజెక్ట్ చేసారట. ఫైనల్లీ ఈ కథ వచ్చి పవన్ కళ్యాణ్ – వరుణ్ తేజ్ వద్దకు వచ్చి ఆగింది . అయితే పవన్ కళ్యాణ్ సలహా మేరకు ఈ కథలో వరుణ్ తేజ్ కన్నా సాయి అయితే బాగుంటాడు అని .. అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గా కూడా కలిసి వస్తుందని చెప్పుకొచ్చారట. మొత్తానికి ప్రభాస్ ఈ సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు . బ్రో సినిమా హిట్ అయిందే కానీ పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అవుతుందని మనం చెప్పలేం . అందుకే అసలే పాపుల్లో ఉన్న ప్రభాస్ ఈ సినిమాని ఒప్పుకొని ఉంటే మరో ఫ్లాప్ తన ఖాతాలో పడి ఉండేది అంటున్నారు అభిమానులు . మొత్తానికి పవన్ బ్రో సినిమా మిస్ చేసుకుని మన ప్రభాస్ బ్రో మంచి పని చేశాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news