Moviesఆ విషయంలో అప్పుడే నాగబాబు కి రివర్స్ అయిన లావణ్య.. కొత్త...

ఆ విషయంలో అప్పుడే నాగబాబు కి రివర్స్ అయిన లావణ్య.. కొత్త కోడలు పిల్ల యమ ఫాస్ట్..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే .. మెగా డాటర్ నిహారిక విడాకుల వార్త గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ..చర్చించుకుంటున్నారు జనాలు. మనకు తెలిసిందే మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు కూతురు నిహారిక రీసెంట్ గానే తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చేసింది . దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు ఆమెపై లేనిపోని నిందలు వేసి మానసికంగా హింసిస్తున్నారు.

అయితే ఇలాంటి క్రమంలోని సోషల్ మీడియాలో మెగా పరువు పోవడానికి కారణం నిహారిక అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ .అయితే ఇదే విషయంపై నిహారికను నాగబాబు సైతం కోప్పడ్డారట .” నీవల్లే మెగా పరుగు పోయింది” అంటూ ఫైర్ అయ్యారట . అంతేకాదు ప్రెసెంట్ నాగబాబు – నిహారిక మాట్లాడుకోవడం లేదని ..దూరం గా ఉన్నారని నిహారికను మెగా ఫ్యామిలీ వెలివేసింది అని ప్రచారం జరుగుతుంది . అయితే ఇలాంటి టైం లోనే మామగారు నాగబాబుకు యాంటీగా డెసిషన్ తీసుకుందట లావణ్య త్రిపాఠి . ఎప్పుడు నాగబాబు – పద్మ – వరుణ్ తేజ్ ల ఒపీనియన్ తన ఒపీనియన్ గా భావించే లావణ్య ..నిహారిక విషయంలో మాత్రం సీరియస్ అయిందట.

“ప్రాబ్లమ్ అనేది ఇద్దరు సైడు ఉంటుంది . ఎప్పుడు ఒకరి వల్లే రాదు.. నిహారికకు అక్కడ ప్రాబ్లం ..ఆకారణంగానే విడాకులు తీసుకుంది.. ఒకరినే బ్లెం చేయలేము.. అలా అని ఆమెపై కోప్పడితే ఎక్కడికి వెళ్తుంది ..మనమే ఇప్పుడు ఆమెకు సపోర్ట్ గా ఉండాలి” అంటూ నాగబాబు నిర్ణయాన్ని సైతం ఎదిరించి నిహారికను నాగబాబు ఇంట్లోనే ఉండేలా చేసి తల్లిగా సపోర్ట్ ఇస్తుందట . ఆశ్చర్యమేంటంటే కొత్తకోడలికి అత్తగారు కూడా సపోర్ట్ చేశారు . దీంతో అప్పుడే నాగబాబుకి రివర్స్ అయిపోయింది లావణ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫాన్స్ . మరికొంతమంది ఆ సపోర్ట్ లేకపోతే నిహారిక ఇప్పుడు ఎదగలేదు అంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి నిహారిక ఎలాంటి నిర్ణయం తీసుకున్న లావణ్య సపోర్ట్ చేస్తుంది అని అర్థం అయిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news