Movies"నేను అలాంటి పని చేశా".. ఓపెన్ గానే చెప్పేసిన కాజల్.. సెన్సేషనల్...

“నేను అలాంటి పని చేశా”.. ఓపెన్ గానే చెప్పేసిన కాజల్.. సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా చందమామ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే రూపం కాజల్ అగర్వాల్ . లక్ష్మి కళ్యాణం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో చిన్న సినిమాల్లో కూడా నటించింది . అయితే మగధీర సినిమాతో ఆమె దశ తిరిగిపోయిందనే చెప్పాలి . స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అప్పటివరకు చిన్న హీరోయిన్గా గుర్తించిన డైరెక్టర్ లు ఆమెను ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తించడం మొదలుపెట్టారు.

అంతేకాదు టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసేసుకున్న కాజల్ ఆ తర్వాత వెంటనే బిడ్డకు కూడా జన్మనిచ్చేసింది . రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్.. మళ్ళీ తన పేరుని టాప్ పొజిషన్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. అయితే రీసెంట్గా అభిమానులతో తాను డిప్రెషన్ కి గురయ్యాను అని ఆ టైంలో చాలా బాధపడ్డాను అన్న విషయం చెప్పుకొచ్చింది .

“డెలివరీ తర్వాత డిప్రెషన్ ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చిన కాజల్ అగర్వాల్ ..అది ప్రతి అమ్మాయికి కామన్ అంటూ చెప్పుకు వచ్చింది. మహిళలు ఎవరైనా సరే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తో ఇబ్బంది పడితే ఫ్యామిలీ వాళ్లకు అండగా నిలబడాలి అని ..అప్పుడే ఆడవాళ్లు పిల్లలు పుట్టిన తర్వాత తమకంటూ కొంత టైం కేటాయించుకొని లైఫ్ లో సెటిల్ అవ్వడానికి చూస్తారని చెప్పుకు వచ్చింది . ఆ విషయంలో తన పేరెంట్స్ తన భర్త ఎంతో సహాయం చేశారని ..అందుకే నేను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగలిగానని చెప్పుకొచ్చింది. దీంతో కాజల్ అగర్వాల్ మాటలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news