Newsఅప్పుడు తల్లి..ఇప్పుడు కూతురు.. ఇంటికి వచ్చిన డైరెక్టర్స్ కి అలాంటి కండీషన్...

అప్పుడు తల్లి..ఇప్పుడు కూతురు.. ఇంటికి వచ్చిన డైరెక్టర్స్ కి అలాంటి కండీషన్ పెడుతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవికి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రెసెంట్ ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఆమెను విపరీతంగా అభిమానిస్తున్నారు .. ఆరాధిస్తున్నారు జనాలు . దానికి కారణం ఆమె ఇండస్ట్రీలో ఉన్న అన్ని నాళ్ళు ఎలాంటి మంచి సినిమాలు చేసిందో ఎంతటి హిట్ ట్రాక్ అందుకునిందో అర్థం చేసుకోవచ్చు . అయితే ఆమె మరణించిన తర్వాత ఆమె కూతురు ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో ముందుకు పోతుంది .

అయితే జాన్వి కపూర్ ఇప్పటివరకు కెరియర్ లో పెద్దగా హిట్ కొట్టిన దాఖలాలే లేవు . గ్లామర్ పరంగా నెట్టుకు వస్తుంది కానీ నటన పరంగా ఎక్కడ అలాంటి ట్రాక్ రికార్డు లేదు ఇలాంటి క్రమంలోని ఆమెకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . అయితే గతంలో శ్రీదేవి చేసిన తప్పే ఇప్పుడు జాన్వి కపూర్ కూడా చేస్తుంది అన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది . గతంలో శ్రీదేవి కూడా ఎవరైనా స్క్రిప్ట్ చెప్తే ఆ స్క్రిప్ట్ లో తానే హైలెట్గా ఉండాలి అని అనుకుంటుందట .

ఇప్పుడు జాన్వి కపూర్ సైతం అదే చేస్తుందట . మొదట కొరటాల శివ ఎన్టీఆర్ థర్టీ సినిమా స్టోరీ చెప్పినప్పుడు కూడా ఎన్టీఆర్ కన్నా ఆమెకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేలా స్టోరీని మార్చమంటూ రిక్వెస్ట్ చేసిందట. గతంలో చిరంజీవి విషయంలో శ్రీదేవి ఇలాగే చేసింది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొరటాల శివ మాత్రం ఎక్కడ ఎన్టీఆర్ రేంజ్ క్రేజ్ తగ్గించకుండా జాన్వి కపూర్ రోల్ జాన్వీ కి ఎన్టీఆర్ రోల్ ఎన్టీఆర్ ది లాగా డిజైన్ చేశారట . ఈ క్రమంలోనే ఇలాంటి తొక్కలో కండిషన్స్ పెడితే జాన్వికాపూర్ మంచి మంచి సినిమాలోని మిస్ చేసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి . మొత్తానికి జాన్వి కపూర్ ఎట్టకేలకు తెలుగు ఆఫర్ పట్టేసింది . ఈ సినిమా హిట్ అయితే అమ్మడు కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news