Moviesనాని కూతురుగా హాయ్ నాన్నలో న‌టించిన ఈ క్యూట్ ...

నాని కూతురుగా హాయ్ నాన్నలో న‌టించిన ఈ క్యూట్ బేబీ ఎవరో తెలిస్తే ..షాక్ అవ్వాల్సిందే ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా.. నేచురల్ స్టార్ నాని పేరు చెప్తే వచ్చే కిక్కే వేరు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని కెరియర్ స్టార్టింగ్ లో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో మనందరికీ తెలిసిందే . కాగా వాటిని ఎదిరించి ఫైనల్లీ టాప్ పొజిషన్ కి చేరుకున్న నాని రీసెంట్ గానే దసరా సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొట్టాడు . అంతేకాదు ఈ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు . కాగా రీసెంట్ గా నాని తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు.

” హాయ్ నాన్న” అనే టైటిల్ తో త్వరలోనే నాని మనల్ని పలకరించబోతున్నాడు . సౌర్యవ్ దర్శకుడుగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి – విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు . ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ హీరోయిన్గా నటిస్తుంది . శృతిహాసన్ కూడా కీలకపాత్రలో నటించబోతుంది . ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా మలయాళం డైరెక్టర్ అబ్దుల్ స్వరాలు అందిస్తున్నారు . జూన్ 13న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను బయటకు వదిలారు.

ఈ ఫస్ట్ గ్లింప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకునింది . తండ్రి కూతుర్ల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో ఈ మూవీ ని రూపొందిస్తున్నారు అంటూ తెలుస్తుంది . కాగా ఈ సినిమాలో నానికి కూతురుగా నటించిన పాప పై అందరూ కళ్ళు పడ్డాయి . చాలా క్యూట్ గా ఉన్న ఈ బేబీ ఎవరా..? అంటూ ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు జనాలు .

ఆమె పూర్తి పేరు కీరా ఖానా. ఈమె తల్లి పేరు శివాజీ ఖాన్నా .ఈ చిన్నారి బ్యాగ్రౌండ్ పెద్దది . ఈమెకు తొలి చిత్రం ఇదే అనుకుంటే పొరపాటే అవుతుంది . ఐదేళ్ల ఖన్నా ఇంతకుముందు బాలీవుడ్ లో ఎన్నో వాణిజ్య ప్రకటనలో నటించింది . థాంక్ గాడ్, బందా సింగ్, బారాముల్లా, సాంబహదూర్ వంటి బాలీవుడ్ చిత్రాల్లో చైల్ట్ ఆర్టిస్ట్ గా చేసి.. త‌న‌దైన యాక్టింగ్ తో నార్త్‌ ప్రేక్ష‌కుల మెప్పు పొందింది.. కియారా ఖన్నాకు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా మూడు లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు . బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న కియారా ఖన్నా కు హాయ్ నాన్నలో అవకాశం రాగానే వాళ్ళ అమ్మ ఓకే చెప్పేసింది. దీంతో ఈ పాపకు మంచి ఆఫర్ వచ్చినట్లయ్యింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news