Moviesషారుఖ్ ఖాన్ గుండు మీద ఉన్న ఈ టాటూ కి అర్ధం...

షారుఖ్ ఖాన్ గుండు మీద ఉన్న ఈ టాటూ కి అర్ధం ఏంటో తెలుసా..? అందుకే నువ్వు “కింగ్” బాసూ..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో,, వెబ్ మీడియాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న జవాన్ సినిమాకి సంబంధించిన న్యూస్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి . దానికి కారణం రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చాలా బాగుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు డైరెక్టర్ అట్లీ ఈ సినిమా కోసం పడిన కష్టం చిన్న టీజర్ తోనే తెలిసిపోయింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో గ్లామర్ టచ్ ను కూడా ఇస్తూ హీరోయిన్గా నయనతార – దీపికా పదుకొనేను పెట్టడం అట్లీ డైరెక్షన్లో మరో కోణం అనే చెప్పాలి.

కాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాలోని టీజర్ లోని ప్రతి పార్ట్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ గుండు పై ఉన్న ఓ టాటూ బయటపడింది . దీంతో సోషల్ మీడియాలో ఈ టాటూకు అర్థం ఏంటి అంటూ తెగ చర్చించేసుకుంటున్నారు జనాలు . కాగ ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ గుండు పై ఉన్న టాటూ కి అర్థం ఇదే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . షారుక్ గుండు పై “మా జగత్ జనని” అని రాసి ఉంది .

“అమ్మ నే ప్రపంచం ” అని టాటూ అర్థం . తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే కొడుకు కదే ఈ జవాన్. ఈ సినిమాని అట్లీ కూడా అదే రేంజ్ లో తెరకెక్కించారు అట్లీ. ఈ సినిమాకి అట్లీ డైరెక్షన్ వహిస్తున్నాడని తెలియగానే సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొ. న్నాయి గతంలో అట్లీ తెరకెక్కించిన సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యాయి . ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . దీంతో ఇప్పుడు షారుక్ ఖాన్ గుండు పై ఉన్న టాటూ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news