Moviesమళ్ళీ NTR తోనే రీఎంట్రీ ఇవ్వబోతున్న ఎన్టీఆర్ హీరోయిన్.. అదృష్టం అంటే...

మళ్ళీ NTR తోనే రీఎంట్రీ ఇవ్వబోతున్న ఎన్టీఆర్ హీరోయిన్.. అదృష్టం అంటే ఇదేగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీని తమ అందచందాలతో ఏలేసిన అందాల ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నేసి లైఫ్ లో వారిని సెటిల్ చేసేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూ తమ వయసుకు తగ్గ పాత్రలను చేస్తున్నారు . ఇప్పటికే బోలెడు మంది అందాల ముద్దుగుమ్మలు ఆ లిస్టులోకి వస్తారు. అయితే తాజాగా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది సింహాద్రి హీరోయిన్ అంకిత అంటూ ప్రచారం జరుగుతుంది .

మనకు తెలిసిందే ఈమధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ ని, ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయిన హీరోయిన్స్ కి సంబంధించిన అడ్రస్ వెతుకుతూ వాళ్ళని మళ్లీ లైవ్ లోకి తీసుకొస్తుంది. అలా హీరోయిన్ అంకితని ఓ యూట్యూబ్ ఛానల్ లైవ్ లోకి తీసుకొచ్చింది . ఎక్కడో అమెరికాలో ఎవరికి కనపడకుండా సోషల్ మీడియాకి మాత్రమే దగ్గరైన హీరోయిన్ అంకిత అడ్రస్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ చేసింది . ఈ క్రమంలోనే అంకిత తన మనసులోని అన్ని మాటలను మొత్తం ఒక్కసారిగా కక్కేసింది.

అంతేకాదు “హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో చేసిన “విజయేంద్ర వర్మ” సినిమా ఫ్లాప్ అవడంతోనే సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాను అంటూ పరోక్షకంగా చెప్పేసిన అంకిత. అవకాశాలు వస్తే కచ్చితంగా మళ్ళీ సినిమాలో నటిస్తాను అంటూ ప్రామిస్ చేసింది . అంతేకాదు బన్నీ – ఎన్టీఆర్ లను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నానని.. వాళ్లతో టచ్ లోనే ఉన్నాను అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే మరోసారి ఎన్టీఆర్ తో అంకిత జతకడితే చూడాలి అని ఫాన్స్ ఆశపడుతున్నారు .

అయితే ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అంకిత మరోసారి అలాంటి హిట్ ఇస్తుందా ..?అనేది సందేహమే. అయితే పలువురు మాత్రం కొరటాల శివకు సజెస్ట్ చేస్తున్నారు . ఎన్టీఆర్ దేవర సినిమాలో అంకితకు ఏదైనా చిన్న పాత్ర అయినా ఇవ్వండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు . చూడాలి మరి కొరటాల – ఎన్టీఆర్ ఫ్యాన్స్ సలహాలు ఏం మాత్రం వింటాడో. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఎన్టీఆర్ సినిమాతో క్రేజ్ దక్కించుకున్న ఈ హీరోయిన్ మళ్లీ ఎన్టీఆర్ సినిమాతోనే రీఎంట్రి జరిగిన్నట్లే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news