Moviesఈ కమెడియన్ ఒక్క కాల్ షీట్ కి ఎంత పుచ్చుకుంటాడో తెలుసా.....

ఈ కమెడియన్ ఒక్క కాల్ షీట్ కి ఎంత పుచ్చుకుంటాడో తెలుసా.. తెలుగు హీరోలు కూడా వేస్టే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో తనా..మనా అనే భేదం లేకుండా అందరి టాలెంటెడ్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు డైరెక్టర్లు. అయితే మన తెలుగు అమ్మాయిలని మాత్రమే ఎంకరేజ్ చేయడం లేదు . టాలెంట్ ఉన్న ఎందుకు పనికిరారు అంటూ టాలెంటెడ్ హాట్ బ్యూటీస్ ను పక్కన పెట్టేస్తున్నారు . అయితే ఎటువంటి టాలెంట్ లేకపోయినా సరే కోట్లు ఖర్చు చేసి పరాయి భాష ముద్దుగుమ్మలను ఎంకరేజ్ చేస్తున్నారు . ఈ విషయం పక్కన పెడితే ఇండస్ట్రీలో పరభాష నటులు ఎక్కువైపోతున్నారు.

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఓ కమెడియన్ పేరు మారుమ్రోగిపోతుంది. ఆయనే యోగి బాబు . స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న యోగి బాబు ..ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . 2009లో విడుదలైన కోలీవుడ్ మూవీ యోగి ద్వారా ఆయన ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ అందుకున్న ఈయన సైలెంట్ కామెడీతో నవ్వించి చంపేస్తాడు అన్న పేరు కూడా ఉంది . అయితే యోగి బాబు నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ కావడంతో ఇక్కడ కూడా పాపులారిటీ సంపాదించుకున్నాడు .

హెల్తీ కామెడీ పంచెస్ వేసే యోగి బాబు ..ఒక్క సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలిస్తే కళ్ళు జిగేల్ అనాల్సిందే . రీసెంట్ గా లవ్ టుడే – బిచ్చగాడు 2 లాంటి సినిమాల్లో కామెడి చేసి కడుపుబ్బ నవ్వించిన ఈ కమెడియన్ ప్రజెంట్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కూడా నటించాడు . కాగా యోగి బాబు ఒక్కో కాల్ షీట్ కి దాదాపు 18 లక్షల తీసుకుంటారు అంటూ ప్రచారం జరుగుతుంది . 20 రోజుల షూటింగ్ ఉన్నట్లయితే నాలుగు కోట్లకు పైగానే అమౌంట్ అందుకుంటారట . దీంతో యోగి బాబు ఒక కాల్ షీట్ కి ఇంత పారితోషకం తీసుకుంటారా ..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news