Movies"స్టార్ హీరోలు అది చూసే హీరోయిన్స్ ని సెలక్ట్ చేసుకుంటారు"..ఐశ్వర్య రాజేష్...

“స్టార్ హీరోలు అది చూసే హీరోయిన్స్ ని సెలక్ట్ చేసుకుంటారు”..ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని హీరోస్ ఎలా ట్రీట్ చేస్తారో అందరికీ బాగా తెలిసిన విషయమే. అందం – అణుకువ ఏం.. మాట్లాడినా సరే ఏం చేసినా సరే ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఉండే హీరోయిన్ లనే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . కేవలం ఓ ఇండస్ట్రీ అనే కాదు అన్ని ఇండస్ట్రీలలో హీరోలు ఇదేవిధంగా ఉంటారు . అయితే అలాంటి హీరోస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ . ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చెప్పక్కర్లేదు . తెలుగు అమ్మాయి అయినా తెలుగులో అవకాశాలు లేక అల్లాడిపోతున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్గా రాజ్యం మేలేస్తుంది లేడీ ఓరియంటెడ్ ఫిలింస్ కు పెట్టింది పెరుగా దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్.. సినిమాలో కనిపిస్తే ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అన్న నమ్మకం జనాల్లో కలిగేలా చేస్తుంది.

అయితే ఎంత నటించినా సరే స్టార్ హీరోలు ఆమెకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఆమె ఓపెన్ గా కామెంట్స్ చేసింది . ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ..” కాక ముట్టయి తర్వాత నాకు ఎవరు ఆఫర్స్ ఇవ్వలేదు . . ఆ రీసన్ ఏంటో నాకు తెలియదు నా కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశాను నాకు నా నటన వచ్చి ఛాన్స్ ఇచ్చిన హీరోలు మాత్రం ధనుష్ -దుల్కర్ సల్మాన్ -విజయ్ సేతుపతి -శివ కార్తికేయ.. మిగతా హీరోలు ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. నాలో ఎంత టాలెంట్ ఉందో మీ అందరికీ తెలుసు.. కథల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా నిర్ణయం తీసుకుంటాను”.

” అయితే ఓ స్టార్ హీరో తన సినిమాలో హీరోయిన్గా తీసుకునే ముందు ఆ హీరోయిన్ మార్కెట్ -ఓటీటీ- డిజిటల్ శాటిలైట్ రైట్స్ ఇవన్నీ చూస్తారు . ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ ముద్దుగుమ్మను తమ సినిమాల్లో పెట్టుకుంటారు . అందుకే బహుశా నన్ను ఏ హీరో సెలెక్ట్ చేసుకోలేదేమో ..మనం కోరుకున్న స్థాయికి ఎదగాలంటే కొన్ని కొన్ని సార్లు తిప్పలు తప్పవు.. దేనికైనా సిద్ధంగా ఉండాలి.. అందుకు నేను రెడీ ..అందుకే లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తున్నాను . ఇప్పటికే 15 చేశాను ..ఇకపై కూడా చేస్తాను .. ఏ హీరో సపోర్ట్ చేయకపోయినా పర్లేదు నా సినిమాలో నేనే హీరో “అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది . ప్రెసెంట్ ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news