Movies"త్రివిక్రమ్ కు సిగ్గు లేదు..రానా కు నీతి లేదు..?".. కాక రేపుతున్న...

“త్రివిక్రమ్ కు సిగ్గు లేదు..రానా కు నీతి లేదు..?”.. కాక రేపుతున్న స్టార్ డైరెక్టర్ ట్వీట్.. !!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఒకరి కథను ఒకరు దొబ్బేసే హీరోలు హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారు . అయితే రీసెంట్ గా ఓ డైరెక్టర్ తీయాల్సిన భారీ సినిమాను మరో డైరెక్టర్ దొబ్బేయడం అది కాస్త ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . ఎస్ ప్రసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు కుర్రాళ్ళు . స్టార్ట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో 30 ఏళ్ల అనుభవం ఉన్న గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ హిరణ్యకశ్యప ను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు లాగేసుకున్నారు . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది .

ఈ సినిమాలో దగ్గుబాటి రానాను మెయిన్ లీడ్గా పెట్టి గుణశేఖర్ సినిమా తెరకెక్కించాలని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . అయితే రానా దగ్గుబాటి ఆలస్యం చేస్తూ ఉండడంతో గుణశేఖర్ ఈలోపు శాకుంతలం కథ రెడీ చేసుకుని సమంత తో తెరకెక్కించారు. ఈ సినిమా హిట్ కాకపోయినా పర్లేదు తనకు ఆ సాటిస్ఫాక్షన్ కలిగింది అంటూ సంచలన కామెంట్స్ చేసిన గుణశేఖర్.. తాజాగా రానా దగ్గుబాటి పై త్రివిక్రమ్ శ్రీనివాస్ పై చేసిన పరోక్ష కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. కొద్ది గంటల క్రితమే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాడు రానా దగ్గుబాటి .

అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా అందరు గుణశేఖర్ అంటూ భావించారు. ఎవరు ఊహించిన విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరుని తీసుకురావడం అభిమానులకి అస్సలు నచ్చలేదు . అంతేకాదు ఈ సినిమా నుండి గుణశేఖర్ ని తీసేసినట్టు చెప్పకనే చెప్పేసాడు రానా దగ్గుబాటి . దీంతో మండిపోయిన గుణశేఖర్ సోషల్ మీడియా వేదికగా ఇద్దరినీ ఏకిపారేశారు . పేర్లు మెన్షన్ చేయకుండా నే నీతి లేదు అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు . కాగా కొద్దిసేపటి క్రితమే గుణశేఖర్ తన సోషల్ మీడియా ఖాతాలు ..”మీ స్టోరీకి దేవుడిని ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు ఆ దేవుడు మీలో ఉన్న చిత్తశుద్ధిని కూడా గమనిస్తూనే ఉంటాడు ..అది మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అనైతిక చర్యలకు నైతిక విలువలతో జవాబు చెప్పే రోజు కచ్చితంగా త్వరలోనే రాబోతుంది అని నాకు నమ్మకం ఉంది “అంటూ సంచలన ట్విట్ చేశారు గుణశేఖర్ .

దీంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ రానా దగ్గుబాటి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకు వర్తిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు . అంతే కాదు కొంతమంది మరింత రేంజ్ లో రెచ్చిపోయి రానాకు అసలు నీతి లేదని ఒక డైరెక్టర్ తో కమిట్ అయిన సినిమాను మరో డైరెక్టర్ తో ఎలా తెరకెక్కిస్తారని అంటుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అసలు సిగ్గులేదు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సోషల్ మీడియాలో జనాలు ఎలా ఏకీపారిస్తున్నారో తెలిసిందే. అయితే ఇలాంటి క్రమంలోనే హిరణ్యకశ్యప సినిమా మట పెట్టిందని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news