Movies"ఆమె చేసిన మోసానికి సూసైడ్ చేసుకోవాలి అనుకున్న".. ఇన్నాళ్లకి అసలు విషయాని...

“ఆమె చేసిన మోసానికి సూసైడ్ చేసుకోవాలి అనుకున్న”.. ఇన్నాళ్లకి అసలు విషయాని బయటపెట్టిన అబ్బాస్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఎంతమంది ..పాన్ ఇండియా హీరోలు పుట్టుకొస్తున్న ..గ్లోబల్ స్థాయిలో అవార్డులు దక్కించుకున్న కొందరి హీరోస్ అంటే అభిమానులకి చచ్చేంత ఇష్టం ఉంటుంది . ఇప్పటికీ వాళ్ళు తెరపై కనిపించకపోయిన సోషల్ మీడియాకి దూరంగా ఉన్న వాళ్ళని దేవుళ్ళ ఆరాధిస్తూ ఉంటారు. వాళ్లలో ఒకరే అబ్బాస్ . నేటి జనరేషన్ కి ఈ పేరు కొత్తగా విచిత్రంగా అనిపించొచ్చు కానీ.. 1990 జనరేషన్ వాళ్లకు మాత్రం ఈ పేరు చెప్తే పూనకాలు వచ్చేస్తాయి. మరీ ముఖ్యంగా హీరో అబ్బాస్ కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

అమ్మాయిలు ఆయన అంటే పడి చచ్చిపోతూ ఉంటారు . అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో అబ్బాస్ . ప్రేమదేశం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారి సినిమా ఇండస్ట్రీని తన నటనతో అల్లాడించేసిన హీరో అబ్బాస్ .. ఎంత త్వరగా కెరియర్ లో సక్సెస్ అయ్యాడో..అంతే త్వరగా ఫ్లాప్ అయ్యాడు . కాగా ప్రభాస్ తన వ్యక్తిగత జీవితంలో తీసుకుని కొన్ని నిర్ణయాల కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు అంటూ వార్తలు వినిపించేవి . కాగ సోషల్ మీడియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. గతంలో తనను అమ్మాయి మోసం చేసింది అన్న నిజాన్ని బయట పెట్టాడు ,

కాగా ఆయన మాట్లాడుతూ “నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయి నన్ను ప్రేమించింది.. నేను ఆ అమ్మాయిని ప్రేమించాను.. కానీ చివరికి నన్ను మోసం చేసింది. ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియలేదు . డిప్రెషన్ కి గురయ్యా అని పిచ్చి పట్టేసింది.. సూసైడ్ చేసుకుందామని నడిరోడ్డుపై నిలుచున్న .. ట్రక్కు ఎదురుగా వస్తుంది .. రెండు నిమిషాలు ఆగి ఉంటే ట్రక్కు నన్ను గుద్దేసేది.. కానీ ఆ ట్రక్కు వెనకాల బైక్ పై ఒక అతను వస్తున్నాడు.. ఒకవేళ అట్రాక్ట్ నన్ను గుద్దుంటే.. ఆ ట్రక్ ని అతగాడు గుద్దుకొని చచ్చిపోయి ఉండేవాడు.. అందుకే నేను తప్పుకున్నాను. నేను మొదటి నుంచి అంతే నా ప్రాణం కన్నా పక్క ప్రాణానికి విలువిస్తాను ” అంటూ చాలా ఎమోషనల్ గా కామెంట్ చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news