Movies"తన ఆఫర్ ని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..నవ్వుకున్న పవన్ కళ్యాణ్...

“తన ఆఫర్ ని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..నవ్వుకున్న పవన్ కళ్యాణ్ “.. వీళ్ళిద్దరి కాంబో లో మిస్ అయిన పరమ చెత్త సినిమా ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . ఆయనను హీరోగా కాకుండా దేవుడిలా భావిస్తూ ఉంటారు అభిమానులు. అందుకే పవర్ స్టార్ ఆయన పేరు వినగానే పూనకాళ్లు వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ప్రజెంట్ ఓవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ ప్రజాసేవకు చేయడానికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ ..మరోవైపు సినిమాలను సైతం చకచకా కంప్లీట్ చేస్తున్నారు .

మరి కొద్ది రోజుల్లోనే ఆయన నటించిన బ్రో సినిమా రిలీజ్ కు సిద్ధం కాబోతుంది అంటూ ఫ్యాన్స్ ఆశపడుతున్న క్రమంలో ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా చాలామంది హీరోయిన్స్ పవన్ కళ్యాణ్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కేవలం గెస్ట్ రోల్ అయినా సరే వస్తే బాగుండు అంటూ ఆశపడుతూ ఉంటారు చాలామంది హీరోయిన్ లు. ఆ అవకాశం వస్తే ఇలాంటి రోల్స్ ని మిస్ చేసుకోరు . అయితే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చినా సరే రిజెక్ట్ చేసింది .

దానికి కారణం ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర పెద్దగా ఉండకపోవడం.. పైగా రొమాంటిక్ సీన్స్ లో నటించాలన్న కారణంగానే రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో కీర్తి సురేష్ పాత్రలో మొదటగా అనుకున్న హీరోయిన్ సాయి పల్లవి అంటూ తెలుస్తుంది. అప్పుడే ఫిదా సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ అజ్ఞాతవాసి సినిమాలో పెడితే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని పైగా ఈ పాత్రకు ఆమె బాగా సూట్ అవుతుందని త్రివిక్రమ్ అప్రోచ్ అయ్యారట. అయితే కథకు బలం లేకుండా ఎలాంటి సినిమా చేయను అని పైగా రొమాంటిక్ సన్నివేశాలల్లో అసలు నటించనని చెప్పుకొచ్చిందట . దీంతో ఈ పాత్ర కీర్తి సురేష్ చేతికి దక్కింది . అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news