Moviesకాజల్ కంటే ముందే గౌతమ్ ఆ హీరోయిన్ ను ప్రేమించాడా..? నమ్మించి...

కాజల్ కంటే ముందే గౌతమ్ ఆ హీరోయిన్ ను ప్రేమించాడా..? నమ్మించి ముంచేసిన స్టార్ బ్యూటి..!?

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు ..డేటింగ్ లు ..ఎఫైర్లు చాలా కామన్ గా వినిపిస్తూ ఉంటాయి ..కనిపిస్తూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం.. మాయా లోకం ..ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ట్ చేయలేరు.. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు . కొందరు స్టార్ హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే ..మరికొందరు హీరోయిన్లు డైరెక్టర్ల ను పెళ్లి చేసుకున్నారు .

మరి కొంతమంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీ తో అస్సలు సంబంధం లేని వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ . తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచులు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది . ఈ క్రమంలోనే అభిమానులతో ముచ్చటించింది . ఈ క్రమంలోనే కాజల్ ను ఓ నెటిజన్ “నన్ను పెళ్లి చేసుకుంటావా..?” అంటూ ప్రశ్నించాడు. దానికి కాజల్..”ఆ అదృష్టం రెండేళ్ల క్రితమే వేరొకరికి దక్కింది”.. అంటూ ఫన్నీగా కౌంటర్ వేసింది .

ఇలాంటి క్రమంలోనే కాజల్ భర్తకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కాజల్ కంటే ముందే కాజల్ భర్త ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ ప్రేమించాడట . ఆమెతో డేటింగ్ కూడా చేశారట . నిజానికి కాజల్ గౌతమ్ కిచ్చులు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ..అయినా కానీ వాళ్ళ మధ్యలో ఆ ఫీలింగ్ లేనేలేదట . ఈ క్రమంలోనే గౌతమ్ వేరే హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఆ హీరోయిన్ గౌతమ్ఇచ్చిన డబ్బులను వాడుకొని ఆయనని వదిలేసిందట . ఆ తర్వాత గౌతమ్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు కాజల్ ఆయనకు దగ్గర అయింది . దీంతో ఇదే నిజమైన ప్రేమ అంటూ కాజల్ ను పెళ్లి చేసుకున్నాడు గౌతమ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news