Moviesబన్నీ-త్రివిక్రమ్ సినిమాలో మరో స్టార్ హీరో.. గురూజీ మళ్లీ పుల్ల పెడుతున్నాడే..!?

బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో మరో స్టార్ హీరో.. గురూజీ మళ్లీ పుల్ల పెడుతున్నాడే..!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. ఆల్రెడీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప1 సినిమా తెరకెక్కి ఇండస్ట్రీని ఏ రేంజ్ లో అల్లాడించిందో మనందరికీ తెలిసిందే . బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొట్టింది . అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయెస్ట్ రికార్డులను నెలకొల్పింది. అంతేకాదు సుకుమార్ పేరును సైతం పాన్ ఇండియా లెవెల్ లో అందరికీ తెలిసేలా చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాల్లో “ఊ అంటావా మామ ” పాట ఇప్పటికీ ఇండస్ట్రీని షేక్ చేసింది అంటే దానికి ప్రధాన కారణం సమంత – అల్లు అర్జున్ కష్టం అని చెప్పాలి .

కాగా పుష్ప సినిమా తర్వాత బన్నీ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో మరో సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటుందట.. ఆ హీరోయిన్ పాత్ర కోసం స్టార్ బ్యూటీని రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తుంది.

కాగ ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో బన్నీ – త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో బన్నీతో పాటు మరో హీరో కూడా ఉండబోతున్నాడట . ఆయన పాత్ర చాలా తక్కువగా ఉంటుందని .. అందుకోసం యంగ్ హీరోని చూస్ చేసుకున్నారని తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమా ఫుల్ టు ఫుల్ కాంట్రవర్షియల్ కంటెంట్ లో ఉండే స్టార్ హీరో హీరోయిన్ ప్రేమను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ అంటూ తెలుస్తుంది. తన ఫ్యామిలీ కారణంగా హీరో హీరోయిన్ విడాకులు తీసుకున్న ఇష్యూ ని ఇందులో హైలెట్ చేసి చూపించబోతున్నారట . దీంతో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news