Moviesప్రాజెక్ట్ కె సినిమాలో దీపిక పదుకునే రోల్ ని మిస్ చేసుకున్న..ఆ...

ప్రాజెక్ట్ కె సినిమాలో దీపిక పదుకునే రోల్ ని మిస్ చేసుకున్న..ఆ తెలుగు బ్యూటీ ఎవరో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమాలలో ప్రాజెక్టుకె కూడా ఒకటి . టాలీవుడ్ రెబల్ హీరో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్ – కమలహాసన్ లాంటి స్టార్లు కూడా నటిస్తూ ఉండడం సినిమాకి మరింత ప్లస్ గా మారింది . నాగ్ అశ్విన్ దర్శకత్వం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ కానుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనేను సెలెక్ట్ చేసుకున్నాడు నాగ్ అశ్వీన్. మరో హీరోయిన్గా దిశా పటానిని చూస్ చేసుకున్నారు. అయితే దీపికా పదుకొనే ప్లేస్ లో మొదటగా ఓ తెలుగు హీరోయిన్ ని అనుకున్నారట. ఆమె మరెవరో కాదు సమంత. హీరోయిన్ సమంత అయితే ఈ పాత్రకు బాగా సూట్ అవుతుందని భావించి ..ఆమె వద్దకు వెళ్లి కధ వివరించారట .

అయితే అప్పటికే సమంత విడాకులు చికాకుల్లో ఉండి ఈ కథను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . ఒకవేళ సమంత మైండ్ మార్చుకొని ప్రాజెక్ట్ కె చేసి ఉంటే మాత్రం కెరియర్ ఎక్కడికో వెళ్లిపోయేది. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది సమంత. ఆ తరువాత ఈ పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ ని అనుకున్నా ఫైనల్లీ దీపిక పదుకునే సెలక్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం అమ్మడు ఏకీంగా 7 కోట్లు ఛార్జ్ చేస్తుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news