Movies"స్పై" ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. కుమ్మి కుమ్మి పడేసిన నిఖిల్..మొత్తం ఎన్ని...

“స్పై” ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. కుమ్మి కుమ్మి పడేసిన నిఖిల్..మొత్తం ఎన్ని కోట్లు అంటే..!

టాలీవుడ్ యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ ..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “స్పై” . ఫుల్ దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కిన స్పై సినిమా నిన్న గ్రాండ్ గా ప్లాన్ ఇండియా లెవల్ లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది . అంతకు ముందే కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్న నిఖిల్ .. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కుతాడు అని అంతా ఎక్స్పెక్ట్ చేశారు .అయితే సినిమా ఎవరు ఊహించిన విధంగా మిక్స్డ్ టాక్ క్రియేట్ చేసుకోవడంతో నిఖిల్ ఫాన్స్ సైతం డిసప్పాయింట్ అయ్యారు.

కాగ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుని ఈ సినిమా కోసం వాడుకున్నారు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు డైరెక్టర్ గ్యారి బిహెచ్ కథను బాగా రాసుకున్న.. ఆ కథను అభిమానులకి తెలియజేసే విషయంలో తెరకెక్కించే మ్యాటర్లో ఫ్లాప్ అయ్యారు అంటూ ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి . ఇలాంటి క్రమంలోనే సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందా అంటూ నిఖిల్ అభిమానులు బిక్కు బిక్కుమంటూ గడిపారు . సీన్ చేస్తే సినిమా టాక్ పరంగా ఎలా ఉన్న కలెక్షన్స్ పరంగా కొన్ని కుమ్మి పడేసాడు నిఖిల్.

ఈ సినిమా మొత్తం 6 కోట్లు కలెక్ట్ చేసి పాజిటివ్ హిట్ గా బాక్స్ ఆఫి వద్ద నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన కేంద్రాలు అయిన హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, వరంగల్ వంటి నగరాలలో స్పై సినిమా వసూళ్లు బాగా రాబట్టింది. దీంతో నిఖిల్ కెరీర్ లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 6 కోట్ల వసూలు చేసి నిఖిల్ స్టామినా మరో సారి ప్రూవ్ చేసింది.

అంతేకాదు మొత్తంగా నైజాంలోనే ఏకంగా 2 కోట్లు వసూలు చేసింది అంటే సినిమా లో మ్యాటర్ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో బాగానే వసూలు చేసిన నిఖిల్ స్పై సినిమా..మిగతా చోట్ల చేతులు ఎత్తేసింది అనే చెప్పాలి. ఈ చిత్రం హిట్ అవ్వాలంటే రెండీ రోజు కలెక్షన్స్ బట్టే తెలుస్తుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ చిత్రం బిజినెస్ 17.5 కోట్లు చేసింది. ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే వారంలోపు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news