Moviesఆఖరికి నిఖిల్ కూడా అదే చేస్తున్నాడుగా..బాలయ్య క్రేజ్ అంటే ఇదే..!!

ఆఖరికి నిఖిల్ కూడా అదే చేస్తున్నాడుగా..బాలయ్య క్రేజ్ అంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునకి సెపెరేట్ క్రేజ్ ఉంది. కొత్త హీరోలు వారి సినిమాల్లో వీరు రిఫరెన్స్ లను వాడుకుంటున్నారు. మెగా స్టార్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాల్లోని పాటలు ఇప్పడు ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తాజాగా విడుదలైన సినిమాలో ఆయన చెప్పినట్టే అరగంటలో క్లోజ్ చేసే ఏ పబ్ లో అయినా వెళ్లి వింటే ఒక స్లోగన్ ఉంటుంది. జై బాలయ్య అని. నందమూరి కుటుంబం అంటే ముందుగా గుర్తొచ్చేది డైలాగులే. బాలకృష్ణ సినీ ఇండస్ట్రీకి తండ్రి వారసుడిగానే ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన అభిమానులు ఆయన సినిమాలు చూడడమే కాదు సేవాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.

ఇప్పుడు బాలకృష్ణ క్రేజ్ పెరుగుతూనే వస్తుంది. ఆయన చేసిన సినిమాలతో పాటు ఆయన తాజాగా చేసిన అన్ స్టాపబుల్ షో కొత్త రికార్డులు సృష్టించింది. తాజాగా అఖండ, వీర సింహారెడ్డి సినిమాలు ఆయనకు సూపర్ హిట్లు ఇచ్చాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాతో ఒక సినిమా చేయగా ఆ సినిమా దసరాకి విడుదల కానుంది. అయితే ఇప్పుడు బాలకృష్ణ క్రేజ్ ను ఒక ఫ్యాన్ ఇండియా సినిమాలో వాడుకునేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా మరేంటో కాదు. విడుదలకు సిద్ధంగా ఉన్న స్పై. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బీహెచ్ డైరెక్షన్ లో రాజశేఖర్ రెడ్డి కథ అందిస్తూ నిర్మించిన ఈ సినిమా జూలై 29వ తేదీన విడుదలవుతుంది. స్పై సినిమా వాయిదా అవుతుందని, కొన్ని గొడవలు కూడా జరిగాయని ప్రచారం జరిగింది. అయితే 500 మంది పనిచేయాల్సిన చోట 2000 మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేశారని తాజా స్పీచ్ లో హీరో నిఖిల్ ఏ చెప్పారు.

అయితే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తారని వార్త వైరల్ అవుతుంది. అయితే అది హీరోనా హీరోయిన్ ఆ లేక ఇతర కీలకపాత్ర ఎవరైనా చేశారా అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ సినిమాలో మాత్రం వీరాభిమానిగా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. బాలయ్య పేరు వాడుకున్న చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టాయి. ఇక ఈ సినిమా కూడా భారీ హిట్ కొడుతుందని కామెంట్లు పెడుతున్నారు. తెలుగు భాషలో తెరకెక్కిన సినిమాని తమిళ, కన్నడ, హిందీ, భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. స్పై టీం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news