Moviesత్వరలో బొమ్మరిల్లు 2 .. క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. సిద్దర్ధ్...

త్వరలో బొమ్మరిల్లు 2 .. క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. సిద్దర్ధ్ ఫ్యాన్స్ కి పండగే..!?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎన్ని సార్లు చూసిన తనివి తీరవు. పాత సినిమాలైనా సరే టీవీలో .. యూట్యూబ్లో .. పెట్టుకుని మరి చూస్తూ ఉంటారు . అలాంటి ఓ సినిమానే బొమ్మరిల్లు . భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తరువాత ఆయన పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా మార్చుకున్నారు. డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఓ కొడుకుని తండ్రి ప్రేమిస్తూనే తన ప్రేమతో కొడుకుని కంట్రోల్ పెట్టే విధానం అభిమానులకి బాగా నచ్చేసింది . అంతేకాదు ఓ తండ్రి కొడుకు గురించి ఏమనుకుంటాడు.. కొడుకు కి తండ్రి పెట్టే రూల్స్ అండ్ రిస్టిక్షన్స్ ని ఎలా ఫేస్ చేశాడు అని క్లియర్ గా చూపించారు డైరెక్టర్ . మరీ ముఖ్యంగా ఈ సినిమాకి కర్త – కర్మ – క్రియ మొత్తం ప్రకాష్ రాజ్ – సిద్ధార్థ్ అంటూ అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన జెనీలియా అప్పట్లో హ హ హసిని అంటూ ఎంతమందిని అలరించిందో మనకు బాగా తెలిసిన విషయమే.

కాగ ఈ సినిమాకి సీక్వెల్ రావాలని ఎంతోమంది అప్పట్లో కోరుకున్నారు. అయితే బొమ్మరిల్లు 2 పై భాస్కర్ ఎలాంటి సాహసం చేయలేదు. రీసెంట్ గా హీరో సిద్ధార్ధ్ “టక్కర్” అనే సినిమా ద్వారా మరోసారి అభిమానులకు తన నటనను పరిచయం చేయబోతున్నాడు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హోస్ట్ నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. బొమ్మరిల్లు 2 ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ హోస్ట్ ప్రశ్నించగా బొమ్మరిల్లు ఇంకో పది సంవత్సరాల తరువాత తీసిన కూడా నాకు ఏమి ప్రాబ్లం లేదు . ఎందుకంటే హీరో సిద్ధార్ధ్ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంటాడు అంటూ తనదైన స్టైల్ లో చమత్కరించారు . ఓ రకంగా చూస్తే బొమ్మరిల్లు 2 ఇక సెట్స్ పై రానట్టే అన్నట్లుగా కామెంట్స్ చేశాడు అంటూ జనాలు భావిస్తున్నారు. కానీ బొమ్మరిల్లు 2 సినిమా తెరపై కనిపిస్తే మాత్రం హీరో సిద్ధార్ధ్ జాతకం మారిపోద్ది. .. ఎక్కడికో వెళ్ళిపోతుందని ప్రత్యేకంగా చెప్పాలా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news