Moviesనక్క తోక తొక్కిన అనిల్ రావిపూడి.. జాక్ పాట్ ఆఫర్ పట్టేసాడు..అదృష్టం...

నక్క తోక తొక్కిన అనిల్ రావిపూడి.. జాక్ పాట్ ఆఫర్ పట్టేసాడు..అదృష్టం అంటే ఇదే..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పటాస్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు . అందరిలా కమర్షియల్ హిట్ సినిమాలు కోసం కాకుండా కంటెంట్ కామెడీ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తూ స్టార్ హీరోయిన్ సైతం తన అభిమానులుగా మార్చేసుకున్నారు.

ఈ క్రమంలోని ప్రజెంట్ అనిల్ రావిపూడి బాలయ్య తో భగవంత్ కేసరి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే బాలయ్య ఎన్టీఆర్ తో సినిమాను లైన్లో పెట్టాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనిల్ రావిపూడి తాను రాసుకున్న కథను తారక్ కి వివరించగా తారక్ ఇంప్రెస్ అయ్యాడని .. అయితే ప్రశాంత్ నీల్ తో సినిమా అయిపోయాక అనిల్ రావిపూడి తో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట.

ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి సైతం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాలయ్యతో సినిమా కంప్లీట్ చేసి ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. ఒకవేళ నిజంగా ఇది నిజం అయితే మాత్రం బ్యాక్ టు బ్యాక్ బాబాయ్ అబ్బాయ్ లతో హిట్ కొట్టిన ఘనత అనిల్ రావిపూడికే దక్కుతుంది . చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news