Moviesమళ్లీ ఆ స్టార్ డైరెక్టర్ తో చేతులు కలిపిన ఎన్టీఆర్.. నందమూరి...

మళ్లీ ఆ స్టార్ డైరెక్టర్ తో చేతులు కలిపిన ఎన్టీఆర్.. నందమూరి అభిమానులకి ఏడుపు తప్పదా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో తన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు . ఆయన లాస్ట్ గా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే . అప్పటినుంచి ఎన్టీఆర్ క్రేజ్ డబల్ స్థాయిలో మారిపోయింది . ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే గ్లోబల్ స్థాయిలో వైరల్ అవుతుంది . ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” అనే సినిమాలో నటిస్తున్నాడు .

ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమాకి కమిటీ అయ్యారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వగానే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలోను నటిస్తున్నారు . ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా హ్యాట్రిక్ హిట్లు అందుకుంటున్న తారక్ మరో సినిమాని సైతం లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది . ఆ డైరెక్టర్ ఎవరో కాదు గతంలో ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ . ఎస్ పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ తో ఎన్టీఆర్ మళ్ళీ చేతులు కలిపాడని .. వీళ్ళకాంబోలో ఓ సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే ఎన్టీఆర్ సుకుమార్ పేర్లు వినగానే అందరికీ టక్కున గుర్తుచేది “నాన్నకు ప్రేమతో”. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలా జనాలను ఏడిపించేసారో మనకు తెలిసిందే. నాన్న సెంటిమెంట్ను బేస్ చేసుకుని వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసింది. కాగా మరోసారి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అంటే ఇలాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ కన్ఫామ్ గా ఉంటుంది అని ..మరోసారి నందమూరి అభిమానులను ఏడిపించడానికి రెడీ అయిపోతున్నారు ఇద్దరు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా వరుసగా యాక్షన్ సినిమాలల్లో చూసిన ఎన్టీఆర్ని ఒక్కసారిగా మళ్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలో చూస్తే నందమూరి అభిమానులు తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news