Moviesఅప్పుడు శృతి హాసన్.. ఇప్పుడు తమన్నా.. చిరంజీవి కూడా కుమ్మేస్తున్నాడుగా..!!

అప్పుడు శృతి హాసన్.. ఇప్పుడు తమన్నా.. చిరంజీవి కూడా కుమ్మేస్తున్నాడుగా..!!

టాలీవుడ్ మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ నటిస్తున్న సినిమా “భోళాశంకర్”. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా 80% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది . మిగతా 20% సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎంత వీలైతే అంత త్వరగా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా భోళా శంకర్ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

సినిమా షూటింగ్ స్పాట్ బ్యూటిఫుల్ లోకేషన్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాసుకోస్తూ..” స్విజర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లోకేషన్లో భోళా శంకర్ కోసం తమన్నతో ఆటపాట ..అద్భుతమైన సాంగ్ షూట్ ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది . త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం ..!! అప్పటివరకు ఈ చిరు లీక్స్ పిక్స్ మీకోసం ” అంటూ చెప్పుకొచ్చారు .

దీంతో ఈ సాంగ్ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు . కాగా గతంలోనూ వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ అప్పుడు శృతిహాసన్ తో.. శ్రీదేవి సాంగ్ ని ముందుగానే సోషల్ మీడియాలో లీక్ చేసాడు చిరంజీవి . కాగా అప్పుడు శృతిహాసన్ తో ఎంజాయ్ చేసిన చిరంజీవి ఇప్పుడు తమన్నాతో స్టెప్స్ వేయడానికి రెడీ అయిపోయాడు . ఇంత ఏజ్ లోను చిరంజీవి ఫారిన్ కంట్రీస్ కి షూటింగ్ లొకేషన్స్ కి వెళ్తూ హీరోయిన్స్ తో తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో టాక్ వైరల్ గా మారింది. చూడాలి మరి శృతి హాసన్ తో హిట్ అందుకున్న చిరంజీవి.. తమన్నాతో ఎలాంటి హిట్ అందుకోబోతున్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news