Moviesbigg boss 7: విడాకులు తీసుకున్న జంట బిగ్ బాస్...

bigg boss 7: విడాకులు తీసుకున్న జంట బిగ్ బాస్ హౌస్ లోకి .. ఈసారి రచ్చ మాములుగా ఉండదుగా..!!

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అప్పటివరకు డ్యాన్స్ ప్రోగ్రామ్లతో కామెడీ షోలతో ఎంటర్టైన్ చూస్తున్న బుల్లితెర సడన్గా ఒకసారి రియాలిటీ అంటూ కొందరు కంటెస్టెంట్స్ ని ఒక రూమ్ లో వేసి తాళం వేసి వాళ్ళు చేసే పనులను లైవ్ లో చూపించడం సరికొత్త సంచలనానికి తెరలేపింది.

ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్బాస్ త్వరలోనే ఏడవ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది . అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఈ షో స్టార్ట్ కాబోతుంది. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారట మేకర్స్ . పోయినసారి ఎలాంటి పాపులారిటి లేని కంటెస్టెంట్స్ ని హౌస్ లోపలికి పంపించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు పాపులారిటీ లేని మనుషలను లోపలికి పంపించి జనాల సహనానికి పరీక్ష పెట్టారు.

అయితే ఈసారి మాత్రం బిగ్బాస్ డబ్బులు కుమ్మరించి మరి స్టార్ సెలబ్రెటీస్ ని ..విడాకులు తీసుకున్న బుల్లతెర జంత ని హౌస్ లోపలికి పంపిస్తున్నారట . అంతేకాదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మార్చేశారట . ఎలిమినేషన్ తర్వాత కంటెస్టెంట్ బయటికి రాకుండా కొత్త ప్లాన్ చేశారట. దీంతో ముందుగానే సోషల్ మీడియాలో ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు అని తెలుసుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి . అంతేకాదు రెమ్యూనరేషన్ అమౌంట్ లో కూడా భారీ మార్పులు చేశారట . దీంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో యాంకర్ ఉదయభాను, కమెడియన్ సుడిగాలి సుధీర్ ..ఆయనతో పాటు యాంకర్ రష్మి కూడా పాల్గొనబోతున్నట్లు ఓ న్యుస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news