Moviesరామ్ - బోయ‌పాటి ర్యాపో… రామ్ కెరీర్‌లో ఆల్ టైం బ్లాక్‌బ‌స్ట‌ర్...

రామ్ – బోయ‌పాటి ర్యాపో… రామ్ కెరీర్‌లో ఆల్ టైం బ్లాక్‌బ‌స్ట‌ర్ రాసిపెట్టుకోండి (వీడియో)

టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు టెంప‌ర‌రీగా బోయపాటి రాపో అని టైటిల్ పెట్టారు. ఈ రోజు రామ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేకర్స్ ఫస్ట్ థండర్ పేరిట ఓ వీడియో వ‌దిలారు. వీడియో ఆద్యంతం మాస్ ఫ్యాన్స్‌కు వీనుల విందుగా ఉంది.

రామ్ చెప్పిన ఊర‌మాస్ డైలాగ్ అదిరిపోయింది. నీ స్టేట్ దాటలేన‌న్నావ్‌… దాటా.. నీ గేట్ దాట‌లేన‌న్నావ్‌.. దాటా… నీ ప‌వ‌ర్ దాట‌లేన‌న్నావ్‌… దాటా ఇంకేంటి దాటేది బొంగులో లిమిట్సూ అన్న డైలాగ్ వీడియోకే హైలెట్‌. సినిమా ఈ రేంజ్‌లో మాస్‌లో ఉండ‌బోతోందో.. మ‌రోసారి అఖండ స్థాయిలో థియేట‌ర్లలో మాస్ జాత‌ర ఎలా ఉండ‌బోతోందో బోయ‌పాటి చెప్ప‌క‌నే చెప్పేశాడు.

వీడియోతోనే సినిమా రేంజ్ బోయ‌పాటి కెరీర్‌లో బిగ్గెస్ట్ సినిమా కానుంద‌ని తేల్చి చెప్పేశాడు. ఇక వీడియోకు థ‌మ‌న్ మ్యూజిక్ హైలెట్‌. శ్రీలీల, సాయి మంజ్రేకర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండ‌గా..ఈ సినిమా టైటిల్ త్వ‌ర‌లోనే రివీల్ కానుంది. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 20, 2023న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news