Moviesస‌మంత వెంట ప‌డుతోన్న స్టార్ హీరో… ఇంత ప్రేమ వెన‌క అస‌లు...

స‌మంత వెంట ప‌డుతోన్న స్టార్ హీరో… ఇంత ప్రేమ వెన‌క అస‌లు కార‌ణం అదా..!

సమంత 12 ఏళ్ల పాటు సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో స్టార్ హీరోలు అందరితోనూ నటించి సూపర్ హిట్లు కొట్టింది. అటు తమిళంలోనూ స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాలలో నటించి హిట్లు కొట్టింది. ఈ తరం జనరేషన్ స్టార్ హీరోలు అందరూ సమంతనే తమ సినిమాలో హీరోయిన్గా కావాలని కోరుకున్నా సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇక నాగచైతన్యతో విడాకులు తర్వాత కూడా ఆమె సినిమాలు కంటిన్యూ చేసింది.

విడాకుల తర్వాత కెరీర్ మీద మరింతగా ఫోకస్ చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇటు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు జోడిగా ఖుషి సినిమాలోని నటిస్తోంది.
ఇదిలా ఉంటే ఒక స్టార్ హీరో ఇప్పుడు సమంతపై ఎక్కడా లేని ప్రేమ కురిపిస్తున్నారు. ఈ ప్రేమ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలోను సంచలనంగా మారింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు కోలీవుడ్ ఇళ‌య‌ దళపతి విజయ్.

ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో నటిస్తున్న లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో త్రిషను కావాలని పట్టుబట్టి మరి విజయ్ తీసుకున్నారని సమాచారం. ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో నటించడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ – నయనతార జంటగా జవాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్‌తో అట్లీ సినిమా ఉంటుంది.

ఈ సినిమా హీరోయిన్ విషయంలో విజయ్ ఒక సంచల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన సినిమాలో సమంతనే హీరోయిన్గా ఉండాలని విజయ్ ఇప్పటికే దర్శక నిర్మాతలకు చెప్పేశారట. గతంలో విజయ్ – సమంత కాంబినేషన్లో కత్తి – మెర్సల్ – తెరి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరిది మంచి హిట్ ఫైయిర్ అన్న పేరు ఉంది.

అందుకే విజయ్ పట్టుబట్టి తన తర్వాత సినిమాలో సమంతనే హీరోయిన్గా తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా విజయ్ సమంతకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చాడు అంటే ఆమె కెరీర్ కు మరికొద్ది రోజులపాటు తిరుగే ఉండదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news